మూత్రపిండాల సమస్యలకు చెక్ పెట్టె పుచ్చ గింజలు.
వేసవికాలం వచ్చిందంటే చాలు.. అందరికీ ముందుకు గుర్తుకువచ్చేది పుచ్చపండునే... వేసవికాలాన్ని పుచ్చపండుకాలం అని కూడా అంటుంటారు కొందరు.. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదటి ప్రాధాన్యత దీనికే ఇస్తారు... గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ పుచ్చపండు ఎంతో మేలు చేసింది.. రక్త పోటు ఉన్నవారు పుచ్చపండు తింటే ఎంతో మేలని చెప్పాలి. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. పుచ్చపండు 91% నీరు, 6% చక్కెరలను కలిగి ఉంటుంది.. ఈ పండులోని నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చపండు అనేది ఓ వరం లాంటిది. భోజనం తర్వాత పుచ్చపండు రసం తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఊబకాయాన్ని తగ్గించడంలో ఇది ఎంతో తోడ్పడుతుంది. మండేవేడిలో తలనొప్పి వస్తే అర గ్లాసు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
విటమిన్ ఎ, బి, సి మరియు ఐరన్ కూడా పుచ్చకాయలో సమృద్ధిగా లభిస్తాయి.. ఆస్తమా బాధితులకి ఇది ఓ ఔషదమనే చెప్పాలి.ఇక ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఈ పండుతో అనేక లాభాలున్నాయి. దీని తీసుకోవడం వల్ల ముఖకాంతి పెరుగుతుంది... ముడతలు తగ్గుతాయి. వేసవిలో చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. ఇక ఇందులోని గింజలు కూడా మనకి ఎంతో మేలు చేస్తాయి... వీటి వలన మెదడు బలహీనమైన నరాలు బలాన్ని పొందుతాయి. కామెర్లు వంటి సమస్యలలో పుచ్చకాయ గింజలను తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. పుచ్చకాయ గింజలతో తయారుచేసిన టీని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మూత్రపిండాల సమస్యలను నివారించవచ్చు.
Tags
Health & Fitness