ప్రపంచ కుబేరుల్లో 5వ స్థానానికి చేరిన అదానీ
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 5వ స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో వారెన్ బఫెట్ను సైతం ఆయన అధిగమించారు. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ప్రకారం, బఫెట్ ఆస్తుల విలువ 121.7 బిలియన్లు. ఇక అదానీ ఆస్తుల విలువ 122.3 బిలియన్లుగా ఉందని ఆ జాబితా పేర్కొంది. అదానీ ఏప్రిల్ 14న 100 బిలియన్ల సంపద క్లబ్లోకి ప్రవేశించారు. ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోని టాప్ 5 సంపన్న వ్యక్తులలో ఒకరిగా స్థానం సంపాదించారు. ఆయన ఆసియాలో అత్యంత ధనవంతుడుగా కూడా నిలిచారు. ఈ జాబితాలో వ్యాపార దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ 269.7 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నారు. అమెజాన్ సహ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 170.2 బిలియన్లతో రెండవ స్థానం, బెర్నార్డ్ ఆర్నాల్ 161.2 బిలియన్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 130.2 బిలియన్ల సంపదదో నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ర్యాంకు పడిపోయింది. ఆయన వ్యక్తిగత సంపద 104.2 బిలియన్ల డాలర్లకు పడిపోవడంతో 8వ స్థానం నుంచి 9
స్థానానికి వచ్చేశారు.
Tags
Latest News