సినీ ఇండస్ట్రీనీ అంటేనే రంగులమయం. ఇక అవకాశాలు రావాలంటే ఎంతో ప్రతిభ ఉండాల్సిందే. హీరోయిన్లకు అదనంగా అందం, అభినయం కూడా ఉండాలి. అయితే కొందరు సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న అమ్మాయిలను వలలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. దీంతో కేస్టింగ్ కౌచ్ అంశం గత కొన్నేళ్లుగా తీవ్ర దుమారం రేపింది. తనకు కూడా ఇదే అనుభవం ఎదురైందని అలనాటి బాలీవుడ్ హీరోయిన్ ఇషా కొప్పికర్ చెబుతోంది. తనను ఓ హీరో ఒంటరిగా రమ్మన్నాడని, ఆ పిలుపు వెనుక దురుద్దేశాన్ని ప్రశ్నిస్తే సినిమా నుంచి తొలగించారని చెప్పింది. ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఓ నిర్మాత గతంలో తనకు ఫోన్ చేసి ప్రముఖ హీరో సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యావని చెప్పినట్లు ఇషా కొప్పికర్ పేర్కొంది. ఈ విషయంపై సదరు హీరోకు తాను ఫోన్ చేయగా ఒంటరిగా తనను రమ్మన్నట్లు వెల్లడించింది. తాను అవకాశాలు కోసం దిగజారలేనని చెప్పినట్లు వెల్లడించింది. దీంతో తనకు ఆ సినిమా అవకాశం చేజారిందని తెలిపింది. 1998లో 'ఏక్ థా దిల్ ఏక్ థీ దడ్కన్' సినిమాతో ఇషా కొప్పికర్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా సినిమాలు చేసింది. తెలుగులో చంద్రలేఖ, ప్రేమతో రా వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
Tags
Movie News