Sravana Masamlo Sri Venkateswara Swamy vari Aradhana(శ్రావణమాసంలో శనివారం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధన యొక్క విశిష్టత )



శ్రావణమాసంలో వచ్చే శనివారం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధనకు చాలా విశేషమైనది. సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధన చేస్తారు. శ్రావణ శనివారం రోజున ప్రత్యేకంగా వేంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు. భక్తులపాలిట కల్పవృక్షం, కలియుగం దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. పిలిచిన వెంటనే పలికే దైవం ఆయన. అటువంటి స్వామిని శ్రావణమాసంలో శనివారం నాడు దీపారాధన చేసి ఆరాధించే విశేషపూజ ఉంది.

 పూజాగదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి, దాని మీద కుంకుమతో శ్రీ వేంకటేశ్వర స్వామి నామం (తిరు నామం) దిద్దాలి. అవకాశం లేనప్పుడు ఏదైనా వేంకటేశ్వరుని ఫొటో తీసుకోవాలి. నీరు ఉపయోగించకుండా, ఆవుపాలు, బెల్లం, బియ్యపుపిండితో చలివిడి కలిపి, దాన్ని ప్రమిద ఆకారంలో తయారు చేయాలి. అందులో ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించాలి. వెలుగుతున్న జ్యోతినే వేంకటేశ్వరునిగా భావన చేసి, జ్యోతి స్వరుపుడైన వేంకటేశ్వరునికి గంధం, పుష్పం, ధూపం, దీపం సమర్పించి, అష్టొత్తరశతనామవాళి (108 నామాలు)తో పూజించి, పానకం, వడపప్పు (నానబెట్టిన పెసరపప్పు) నైవేద్యం పెట్టాలి (అవి కాక ఇతర పదార్ధాలు పెట్టడమనేది మన ఇష్టం, శ్రద్ద), మనసులో ఉన్న కోరికను స్వామికి విన్నవించాలి. దీపం కొండెక్కిన తర్వాత చలివిడిని కూడా నైవేద్యంగా స్వీకరించాలి. ఇది శ్రావణ శనివార #వేంకటేశ్వర దీపారాధన.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال