మేము బీదవాళ్ళము ఇవ్వడానికి ఏమీ లేదు అని మీరు అనుకుంటే అది మీ పొరబాటు..
దేవుడు ఇచ్చిన స్వచ్ఛమైన చిరు నవ్వు , పదునైన మాట అనే ఆయుదం మీ దగ్గర ఉంది. ఒక మనిషిని నవ్వుతూ పలకరించడం, బాధలో ఓదార్చడం , కష్టంలో వెంట నిలవడం , భయపడ కుండా నేను ఉన్నాను అని తోడు చెప్పడం ఇవన్నీ మీరు ఇవ్వగలిగినవే. అలాగే కొందరి చాడీలు చెప్పే గుణం వల్ల కాలక్షేపం కోసం చేసే నిందలు వల్ల కొందరి జీవితమే నాశనం అవుతుంది కుటుంబాలు కూలిపోతుంది,అది మహా పాపం . మంచి మాటలు మాట్లాడాలి మీ మాటతో ఆత్మ హత్య చేసుకోవాలి అనుకునే వారి మనసు మార్చగలరు, కుటుంబన్ని కలప గలరు. ధైర్యాన్ని సంతోషాన్ని ఇవ్వగలరు. అనారోగ్యంతో ఉన్న వారికి సేవచేయగలరు. సహాయం అంటే ధనమే అనుకుంటే డబ్బు ఉన్న వారికి మనిషి తోడు అవసరం ఉండదుకాని డబ్బు లేకున్నా మనిషి బతుకుతున్నారు కానీ ఇంకో మనిషి తోడు లేకుండా కాటికి కూడా చెరలేడు. ఎన్ని రోజులు బతుకుతాము తెలియదు ఉన్న రోజుల్లో కలిగిన దాంట్లో సంతోషం ఉండే ప్రయత్నం చేయాలి. చిన్న తప్పులు క్షమిస్తే వ్యక్తులు మధ్య బంధం బల పడుతుంది. నిజం చెప్తే చిన్న మాటతో పోతుంది అపద్దo చెప్తే నమ్మకం పోతుంది. నీవల్ల ఒకరికి కోపం వస్తే క్షమించండి అంటే సరిపోతుంది సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. నీ పైన నమ్మకం పోతే ఆ బంధం తెగిపోతుంది. పగ ప్రతికారం తో రగిలిపోవడం అంటే నీకు నువ్వు విషాన్ని నింపుకోవడం అంటే అనారోగ్యం తెచ్చుకుంటారు అందుకే ద్వాషాన్ని వదిలేయాలి.
Tags
Health & Fitness