About Rayala vari Kullur Seema(రాయలవారి కుల్లూరు సీమ గురించి)

About Rayala vari Kullur Seemaకుల్లూరి సీమకు విజయనగరసామ్రాజ్యానికీ విడదీయరానిసంబంధం ఉంది .శ్రీకృష్ణదేవరాయల హయాంనుండీ ఆరవీటి రాజుల హయాం వరకూ  సంబంధం కొనసాగింది . విజయనగర రాజులు పరిపాలనా సౌలభ్యం కొఱకు  సామ్రాజ్యాన్ని కొన్ని రాజకీయ విభాగాలుగా మలచుకున్నారు . ' సీమ ' అనే విభాగం అందులో ఒకటి. నెల్లూరు సీమ , ఆత్మకూరు సీమ , వెంకటగిరి సీమ , రాపూరు సీమ , కుల్లూరు సీమ  అనేవి మన ప్రాంతానికి చెందిన ' సీమ ' విభాగాలు .

          విజయనగర సామ్రాజ్యాన్ని  ఏలిన  సంగమ సాలువ   వంశాల తదుపరి  తుళువ వంశం అధికారాన్ని చేజిక్కించుకుంది . తుళువ నరసనాయకుడు  నాగలాంబల కుమారుడు శ్రీకృష్ణదేవరాయడు   తిమ్మరసయ్య తంత్రాంగంతో 1509 లో ఆగష్టు 8 న శ్రీజయంతి పర్వదినాన విజయనగర సామ్రాజ్య పట్టాభిషిక్తుడైనాడు . దిగ్విజయ యాత్రలు సాగించి , సామ్రాజ్యాన్ని బహుదా విస్తరించి , అవిఛ్ఛిన్నంగా 1529 వరకూ రాజ్యపాలన చేసాడు . ఉదయగిరి , కొండవీడు ,కొండపల్లి , సంహాచలం ప్రాంతాలను ఆక్రమించాడు .ఉదయగిరి దుర్గాధిపతి తిరుమల రాహత్తరాయని ఓడించి ,  తన సేనాపతి  రాయసం కొండమరుసయ్యను దుర్గాధిపతిగా నియమించాడు . దుర్గంలోని బాలకృష్ణ విగ్రహాన్ని రాజధాని హంపికి తరలించి , కృష్ణాలయం నిర్మించాడు . 1512 లో ఉదయగిరి దుర్గాధిపతిగా నియమించబడ్డ కొండమరుసయ్య మహామంత్రి తిమ్మరు సయ్య సమకాలికుడు , బంధువు , సేనానులలో ఒకడు . నాటి కుల్లూరు సీమలో నేటి కలువాయ , అనంతసాగరం  మండలాలూ , తెగచెర్ల వరకూ రాపూరు మండలంలో కొంతభాగం గ్రామాలు ఏలుబడిలో ఉండేవి .ఈ ప్రాంతాలు నీటి యెద్దడితో పంటలు పండక కరువు కాటకాలతో సతమతమవుతూ ఉండుటను తెలుసుకుని రాయలవారు సేద్యపరంగా చెఱువులు నిర్మించడానికీ , సైనికపరంగా వటిష్టం చేయడానికీ పూనుకుని , ఉదయగిరి దుర్గంనుండి కుల్లూరుసీమకు అధిపతిగా నియమించి నాడు . కొండమరుసయ్య 1514 ~ 15 ప్రాంతంలో కుల్లూరు పట్టణంలో మట్టికోటను నిర్మించి , కోటకు ప్రక్కనే నల్లచెఱువును , శివాలయాన్నీ నిర్మించాడు . కోట చుట్టూ శత్రు దుర్భేద్యంగా అగడ్తను ఏర్పరచినాడు . తంజనగరం నుండి గుఱ్ఱాలను కొని తెచ్చి , కోటలో ఆశ్విక దళాన్ని ఏర్పాటు చేసి , కుల్లూరును సైనిక పట్టణంగా తీర్చిదిద్దినాడు . అరోజుల్లో , కుల్లూరు పట్టణం  యుధ్ధ విద్యలలో నిరంతర శిక్షణ శిబిరాలతో సందడిగా ఉండేది . కొండమరుసయ్య ఆధిపత్యంలోనే అనంతసాగరం , కలువాయ చెఱువులు కూడా నిర్మింప బడ్డవి . విజయనగర రాజుల హయాంలో  ఒక సంవత్సరకాలం అంటే _ ఆశ్వజయ శుధ్ధ దశమి మొదలు మహర్ణవమి వరకు . సాంప్రదాయం కుల్లూరు పట్టణంలో కూడా ఉండేది . ఆశ్వజయ మాసారంభం నుండి మహర్ణవమి వరకూ తొమ్మిది రోజులు పట్టణంలోని సైనిక శిబిరాలలో యుధ్థవిన్యాసాల పోటీలు జరిగేవి .గెలుపొందిన వీరులకు విజయదశమి రోజున బహుమతి ప్రదానం జరిగేది . విజయదశమి నుండి జైత్రయాత్రలు సాగించేవారు . చంద్రగిరి రాజధానిగా పాలించిన సాళువ నరసింహరాయల వద్ద కొలువు చేసిన ఆరవీటి తిమ్మరాజు రాజుగా విజయనగర సామ్రాజ్యాన్ని ఆరవీటి వంశం చేజిక్కించుకుంది . తిమ్మరాజు కొడుకు తిరుమలరాయలు . అతని కొడుకులలో వీర వెంకటపతి రాయలు చంద్రగిరి రాజధానిగా తమిళప్రాంతాన్ని 1612 వరకూ పాలించినాడు .           వీర వేంకటపతి రాయలపై తమిళప్రాంతం లోని పాండ్యులు తిరుగుబాటు చేసినారు . తిరుగుబాటును రాయల సామంతరాజు రేచర్లపద్మనాయక ప్రభువైన  రాజా వెలుగోటి వెంకటపతినాయనింగారు సమర్ధంగా అణచివేసినారు . అందుకు బహుమానంగా వీరవేంకటపతిరాయలు నెల్లూరు ప్రాంతాన్ని అమరానకు పాలించుకొనుటకిచ్చి , పంచపాండియధరావిభాళుండు , సంగ్రామపార్ధుండు , పద్మనాయక వంశాంభోది  చంద్రుండు అను బిరిదులతో నాయనింగారిని సత్కరించినారు .నాయనింగారి ఏలుబడి లోకి కుల్లూరిసీమ కూడా చేరింది . అటుపై రాజా చింతపట్ల రుద్రప్పనాయనింగారిని కుల్లూరిసీమ కధిపతిగా నియమించుకొనిరి .

 విజయనగర రాజుల మార్గంలోనే  ,  వెలుగోటి వెంకటపతి నాయనింగారు కుడా ప్రజోపయోగ కార్యాలలోప్రసిధ్ధి చెందిరి . అనేక చెరువులు వీరి హయాంలోనే మరమ్మత్తులకు నోచుకున్నవి . కుల్లూరుసీమలో భాగమైన అనంతసాగరం చెఱువు గట్టు కేతామన్నేరు ఉరవడికి ప్రతియేటా తెగి , నీళ్ళు ఊళ్ళను ముంచుతుండేవి .  వెంకటవతి నాయనింగారు రుద్రప్పనాయనింగారిచే కట్టను పటిష్టపరచి , తూము నిర్మింపజేసి శాశ్వత పరిష్కారం చూపినారు . అనంతరం కలువాయ చెఱువుకు అలుగు నిర్మించినారు . 1612లో రాజా వెలుగోటి వెంకటపతి నాయనింగారు  కుల్లురుసీమ అధివతి రాజా చింతపట్ల రుద్రప్పనాయనింగారిని తన కొలువుకు రావించి ,సబహుమానంగా గౌరవించి ,  తన తండ్రి రాజా కుమార తిమ్మానాయనిగారికి పుణ్యం కలుగునట్లుగా కుల్లూరు నల్ల చెఱువుకు తూర్పలుగు నిర్మించవలసందిగా కోరిరి .వారికోరిక మేరకు రుద్రప్పనాయనింగారు ముప్పదిమూడు శిలాస్ధంభాలతో నల్లచెఱువుకు అలుగు నిర్మాణం చేపట్టినారు . సాక్ష్యంగా ఇప్పటికీ మా చెఱువు గట్టున ఒక శిలా శాసనం ఉంది .

COMMENTS

BLOGGER
పేరు

Actress Photo Gallery(యాక్ట్రెస్ ఫోటో గల్లెరీస్),404,Devotional(భక్తి & ఆధ్యాత్మికం),53,Health & Fitness(ఆరోగ్యం),61,Hot n Spicy Photo Stills (హాట్ ఫోటో స్టిల్స్),399,Latest News(లేటెస్ట్ న్యూస్),9,Latest Tech News & Gadgets(లేటెస్ట్ టెక్ న్యూస్ -గాడ్జెట్స్),14,Movie News( సినిమా వార్తలు),31,Video Trailers(వీడియో ట్రైలర్స్),6,Viral News & Videos(వైరల్ న్యూస్ &వైరల్ వీడియోస్),4,
ltr
item
Telugu-Latest News,Telugu Cinema News,Tollywood,Hot n Spicy Photos,Videos : About Rayala vari Kullur Seema(రాయలవారి కుల్లూరు సీమ గురించి)
About Rayala vari Kullur Seema(రాయలవారి కుల్లూరు సీమ గురించి)
About Rayala vari Kullur Seema
https://1.bp.blogspot.com/-nJziugbRZj8/Xu7hGdgP3RI/AAAAAAAABzU/hTKnkLv2wZkZAnu3RJAGYjCYPc7uZ6lPACLcBGAsYHQ/s400/About%2BRayala%2Bvari%2BKullur%2BSeema.jpg
https://1.bp.blogspot.com/-nJziugbRZj8/Xu7hGdgP3RI/AAAAAAAABzU/hTKnkLv2wZkZAnu3RJAGYjCYPc7uZ6lPACLcBGAsYHQ/s72-c/About%2BRayala%2Bvari%2BKullur%2BSeema.jpg
Telugu-Latest News,Telugu Cinema News,Tollywood,Hot n Spicy Photos,Videos
https://telugu.thecinesizzlers.com/2020/06/about-rayala-vari-kullur-seema.html
https://telugu.thecinesizzlers.com/
https://telugu.thecinesizzlers.com/
https://telugu.thecinesizzlers.com/2020/06/about-rayala-vari-kullur-seema.html
true
5147119826897992282
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy