Benefits of Taking Black Berry Seeds Powder with Curd(నేరేడు గింజల పొడిని.. పెరుగుతో కలిపి తీసుకుంటే కలిగే లాభాలు)




నేరేడు పండ్లను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. నేరేడు చెక్క, నేరేడు గింజలు, ఆకులు, వేర్లు అన్నీ ఔషధ గుణాలతో కూడుకున్నవి. నేరేడు చెక్కలను నీటిలో మరిగించి.. నీటిని వడగట్టి తీసుకోవడం ద్వారా మధుమేహం దరిచేరదు. మధుమేహగ్రస్థులు రోజూ అరకప్పు తీసుకోవడం ద్వారా శరీరంలోని చక్కెర స్థాయులను తగ్గించుకోవచ్చు. ఇంకా నేరేడు గింజల పొడిని తీసుకుంటే మధుమేహాన్ని పక్కనబెట్టేయవచ్చు.  

కాలేయానికి సంబంధించిన రుగ్మతలను, ఉదర సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజూ నేరేడు గింజల పొడిని నీటిలో మరిగించి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట నీటిని అరకప్పు మేర తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. నేరేడు పండ్ల రసాన్ని మూడు పూటలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది

మెదడు సంబంధిత వ్యాధులను నేరేడు పండ్లు తొలగిస్తాయి. కిడ్నీలో ఏర్పడే రాళ్లను తొలగించుకోవాలంటే.. నేరేడు పండ్లను రోజూ తీసుకోవాలి. ఆపై నేరేడు గింజలను ఎండబెట్టి.. పొడి చేసుకుని పెరుగుతో కలిపి తీసుకుంటే కిడ్నిలో రాళ్లు కరిగిపోతాయి. మహిళలకు గర్భాశయ రుగ్మతలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال