Priyanka Chopra Revealed Her Body Fintness Secret(తన బాడీ ఫిగర్ సీక్రెట్ చెప్పినా ప్రియాంక చోప్రా)


ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. తన అందం , అభినయంతో స్టార్ హీరోల స్థాయికి ఎదిగింది. ఆమె తన యాక్టింగ్ కెరీర్ని ప్రారంభించక ముందు, మోడల్ గా కూడా చేసింది. ప్రపంచ సుందరి కిరీటం కూడా తన ముందు సలాం చేసింది.. ప్రియాంక ఎప్పుడూ తన బరువు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎప్పుడు ఫిట్, స్లిమ్ గా ఉంటుంది.

ప్రియాంక వయస్సు పెరిగేకొద్దీ ఆరోగ్యంగా, యవ్వనంగా మారుతోంది. మూడు పదులు వయసు దాటిన ఇప్పటికీ చెక్కుచెదరని అందం ఆమె సొంతం. తను మంచి ఫుడీ కూడా. తాను ఆహార ప్రియురాలినని ప్రియాంక ఎప్పుడూ చెబుతుంటుంది. అయితే, తన డైట్లో ఆయిల్ ఐటెమ్స్ ఉండవు. రెడ్ వెల్వెట్ కేక్‌, హాట్ చాక్లెట్ డ్జ్‌, జిలేబీలు వంటివి ఇష్టంగా తింటుంది. అయినా.. ఎప్పుడు ఫిట్ గా ఉంటుంది. ఇందుకోసం ఎలా మెయింటెయిన్ చేస్తుందో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఆమె ఆరోగ్యం, ఫిట్నెస్ విషయంలో అనేక మందికి ప్రేరణగా నిలిచింది.
ఎక్సర్సైజ్ రొటీన్..

బిజీ షెడ్యూల్, జర్నీ ఉన్నప్పటికీ, ప్రియాంక చోప్రా రెగ్యులర్గా వ్యాయామం చేస్తుంది. బరువు తగ్గడానికి జిమ్ లో కాసేపు ఎక్సర్సైజ్ చేస్తుంది. ముందుగా ఆమె కొన్ని కార్డియో వ్యాయామాలు చేసి తర్వాత యోగా చేస్తుంది. ప్రియాంక చోప్రా రోజూ లంజస్, బెంచ్ జంప్స్, పుష్-అప్స్ అలాగే క్రంచెస్ వంటి ఇతర ఎక్సర్సైజెస్ కూడా చేస్తుంది. ఒకవేళ వర్కవుట్ ఏదీ చేయడానికి సమయం లేకపోయినా, ఇష్టం లేకపోయినా ఇంట్లోనే స్పిన్నింగ్ చేయడంతో పాటు వీలైన చోట రన్నింగ్ చేస్తూ ఫిట్నెస్ రొటీన్ ని కొనసాగిస్తుందట. ఆమె 'మేరీ కోమ్' చిత్రం కోసం బాక్సింగ్ లో కూడా శిక్షణ పొందింది, ఆపై ఆమె సరైన ఆహారం తినడం ద్వారా తన శరీరాన్ని సన్నగా, ఫిట్ గా మారిపోయింది. ఇందుకోసం ప్రియాంక చాలా కష్టపడుతుంది.

ఎక్సర్సైజ్ లేని రోజు..

ర్కవుట్ చేయని రోజు ప్రియాంక యోగా చేయడానికి ఆసక్తి చూపిస్తుంద‌. ఇది ప్రపంచంలోనే కు ఇష్టమైన విషని తెలిపింది. యోగా మానసిక ప్రశాంతను పెంచడంతో పాటు రీరాన్ని ఫిట్గా ఉంచడానికి కూడా సాయపడతుందని ఆమె అభిప్రాయం. మరియు ఫ్లెక్సిబిలిటీని కూడా పెంచుతుంది. యం కుదిరినప్పుడల్లా అర్థ యోగా చేయటానికి ఇష్టపడతుంట. రోజూ ఉదయాన్నే ఆరు గంటకు లేచే ప్రియాంక లేవగానే యోగా చేస్తుంద‌.
 
డైట్ ప్లాన్..

ప్రియాంక చోప్రా ఆహార ప్రియురాలు. కానీ సంవత్సరాలుగా, ఆమె తన డైట్ ప్లాన్ ను తప్పక పాటిస్తుంది. ఇది ఆమెను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచేందుకు సాయపడుతుంది. ఆమె ఆయిలీ ఫుడ్కి దూరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యకరమైన ఆహార శైలిని అనుసరిస్తుంది. ప్రియాంక చోప్రా ఎక్కువగా ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు, అధిక ప్రోటీన్ ఆహారాలను తీసుకుంటుంది. ఆమె రోజంతా క్రమం తప్పకుండా తింటుంది. ప్రతి 2-3 గంటలకు భోజనం, అల్పాహారం తీసుకుంటుందని చెప్పింది. ఇది ఆమె జీవక్రియ వేగంగా పనిచేయడానికి సాయపడుతుంది. ఆమె శక్తి స్థాయిలను అధికంగా ఉంచుతుంది. ఏదైనా తినాలి అన్న కోరికలను కూడా నివారిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వైపు కూడా ద్యాస వేళ్ళనివ్వదు.

ఆమె రెగ్యులర్ దేశీ భోజనాన్నీ తినడానికి ఇష్టపడుతుంది. అంతేకాక చేపలు, చికెన్ వంటి ప్రోటీన్లతో పాటు మొలకలు వంటివి కూడా తింటుంది. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. డిన్నర్లో ఆహారం చాలా క్కువగా తీసుకోవడానికి ఇష్టడుతుంది. మరియు సాయంత్రం వేళ త్వరగా భోజనం ముగిస్తుంది. అంతేకాక ఆమె ఎక్కువగా నీరు తాగుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల తానూ హైడ్రేట్ గా ఉండటానికి సాయపడుతుందని ప్రియాంక చెబుతుంది.
 
చాలా వరకూ సెలెబ్రిటీలు తిండి విషయంలో నోరు కట్టుకుంటారు. ఎందుకంటే తింటే లావు అయిపోతారని ఎక్కువగా డైటింగ్, జీరో సైజ్ అంటూ ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ, మన ప్రియాంక చోప్రా మాత్రం తన నచ్చింది తింటుంది. అలానే అదే విదంగా వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటుంది. అయితే, ఆమె కేవలం నూనె పదార్ధాలకు మాత్రమే దూరంగా ఉంటుంది. అంతేకానీ, అన్ని తింటుంది. నోరూరించే ఫుడ్ అంటే ఎంతగానో ఇష్టడే ప్రియాంక వారానికోసారి చ్చిన ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది. ఇందులో భాగంగా పిజ్జా, ర్గర్, ఫెల్లో వింగ్స్‌, డోనట్స్ తీసుకుంటుంద‌. అలానే వ్యాయామాలు కూడా చేస్తుంది. ప్రియాంక ఎక్కువగా ఇంట్లో వండినవి మాత్రమే తినటానికి ఇష్టపడుతుంది. బ్యూటీ విషయంలో కూడా ప్రియాంకా ఎక్కువగా హోమ్ రెమెడీస్ పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆమె తన జుట్టు, చర్మ సౌందర్యం కోసం తన తల్లి వద్ద నుంచి నేర్చుకున్న చిట్కాలను పాటిస్తూ ఉంటారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال