How Do Perform God Narasimha Swamy Pooja Wednesday(బుధవారంనాడు నరసింహ స్వామి పూజ ఏ విధంగా చేయాలి )


బుధవారం పూట నరసింహ స్వామిని పూజించడం ద్వారా ఈతిబాధలువుండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మానవునికి ఈతిబాధలు ఎందుకొస్తాయనే అంశంపై భోజ మహారాజు తన గ్రంథం నీతిభూషణలో ఇలా పేర్కొనియున్నారు.

మనిషి పితృదేవతలను పూజించడో, స్తుతించడో అతని ఈతిబాధలు తప్పవని తెలిపాడు. ఇది కాకుండా దేవతలను నిందించడం, అన్యోన్యంగా వుండే దంపతులను విడదీయడం, కుటుంబంలో కలతలు సృష్టించడం.. నోరు లేని జీవాలను హింసించడం, పూర్వ జన్మల పాపాలు వెంటాడే కారణంగా మానవునికి ఈతిబాధలు వుంటాయి

అందుకే పూర్వ జన్మ పాపాలు తొలగించుకోవడం.. తెలిసీ తెలియని పాపాల నుంచి గట్టెక్కాలంటే.. మనం చేయాల్సిందల్లా శ్రీ నృసింహ స్వామిని పూజించాలి. పాపాలు తొలగిపోవాలంటే.. భక్తిని మించిన పరిహారం లేదు. పూర్తి విశ్వాసంతో.. నరసింహ స్వామిని శరణు కోరితే.. పాపాలు తొలగిపోవడం తద్వారా ఈతిబాధల నుంచి తప్పించుకోవడం వంటివి చేయొచ్చు

తూర్పు దిశలో ఇంట్లోని పూజగదిలో నరసింహ స్వామి పటాన్ని వుంచి పూజించాలి. రోజూ శుచిగా స్నానమాచరించి.. నరసింహ ప్రభక్తి శ్లోకాన్ని 3, 12, 24, 48 సార్లు పారాయణం చేయడం ద్వారా ఈతిబాధలుండవు.

శ్లోకాన్ని పఠించేటప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి పటం ముందు దీపం వెలిగించి.. మరిగించి చల్లార్చిన ఆవు పాలను లేదా పానకాన్ని నైవేద్యం చేయాలి. ప్రసాదాన్ని కుటుంబంలోని అందరూ తీసుకోవాలి. ఇలా 48 రోజుల పాటు నరసింహ స్వామిని ఆరాధించినట్లైతే కోరిన కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال