Milky Beauty Love Affair with Pak Crickter(పాక్ టాప్ క్రికెటర్తో మిల్కీ బ్యూటీ లవ్ ఎఫైర్ .. నిజమేనా )


క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య ప్రేమాయణం కొత్తేమీ కాదు. కొన్ని జంటలు పెళ్లి పీటలు ఎక్కగా.. మరికొన్ని మధ్యలోనే విడిపోయాయి. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పాక్ క్రికెరట్తో పీకల్లోతు ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక ఫోటోను పట్టుకుని తమకు నచ్చిన కథ అల్లేస్తున్నారు కొందరు. ఎప్పుడో దిగిన ఫోటోను ఆదారంగా చూపిస్తూ.. ఇప్పడు ముడిపెడుతున్నారు. అయితే ఇది అవాస్తవం.
దాదాపు మూడేళ్ల క్రితం తమన్నా జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్ కు వెళ్లింది. కార్యక్రమానికి రజాక్ కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి బంగారాన్ని చూపిస్తూ కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. కాగా.. ప్రస్తుతం ఫోటోను పట్టుకుని తమన్నా పాకిస్థాన్ క్రికెటర్తో ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటుందని.. అందుకే ఇద్దరు కలిసి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వెళ్లారనే ప్రచారం హల్ చల్ చేస్తోంది.

ఇన్నాళ్లు కామ్గా ఉన్న లాక్ డౌన్ సమయంలో తెరపైకి తీసుకొచి తప్పడు ప్రచారానికి తెరలేపారు.. నెట్టింటి కేటుగాళ్లు. పుకార్లపై తమన్నా ఆగ్రహాం వ్యక్తం చేసింది. అసలు ఏం తెలుసుకోకుండా ఎలా రాస్తారు..? మీ ఇష్టం వచ్చినట్లు రాస్తే ఎవరు ఊరుకోరు..? ఇలాంటి పుకార్లను ఇకనైనా ఆపాలని మండిపడింది తమన్నా. తనకు ఇప్పటి వరకు ఎవరితోనూ ఎలాంటి ఎఫైర్ లేదని, మరో రెండేళ్లలో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానని, తన పెళ్లి చేసుకునేటప్పుడు అందరికి చెప్పే చేసుకుంటానని ఇలాంటి పుకార్లను పుట్టించవద్దని చెప్పింది. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నట్లు చెప్పింది ఈమె. గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న సీటీమార్ చిత్రంలో తమన్నా నటిస్తోంది. ఇక అబ్దుల్ రజాక్ పెళ్లి అయిన సంగతి తెలిసిందే

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال