కాన్బెర్రా: కొన్నిసార్లు మనకు అనుకోని ప్రమాదాలు
ఎదురవుతుంటాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్కు చెందిన
మైకేల్ హిల్లియార్డ్ కూడా తనకెదురైన ప్రమాదం
నుంచి తృటిలో తప్పించుకుని బతుకుజీవుడా అనుకున్నాడు. వివరాల్లోకి వెళితే మైకేల్.. ఎప్పటిలాగే కిచెన్లో వంట పూర్తి
చేసుకున్నాక పాత్రలు కడిగేద్దాం అనుకున్నాడు. వెంటనే ట్యాప్ ఆన్ చేసి పాత్రలు
తోమడం ప్రారంభించగా సింక్లో బుసలు
కొడుతూ కనిపించిన పాము చూసి షాక్ కొట్టినంత
పనైంది. వెంటనే స్నేక్గార్డులకు సమాచారం అందించి పాము కదలికలను మన్ను
కొట్టిన పాములా చూస్తుండిపోయాడు. అప్పటివరకు దాని విన్యాసాలను కెమెరాలో
బంధించాడు. అనంతరం ఈ వీడియోను సోషల్
మీడియాలో షేర్ చేశాడు.
"దేవుడి దయ వల్ల ఆ
పాము నన్నేమీ చేయలేదం"టూ గాఢంగా నిట్టూర్పు
విడిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్
మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు
ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'అంత విషపూరితమైన పాము
కిచెన్లోకి ఎలా వచ్చిందబ్బా!'
అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగా, 'అది కాటు వేసుంటే
మరోసారి వంట చేసేందుకు ఆ
పెద్ద మనిషి ఉండేవాడు కాద'ని కామెంట్లు చేస్తున్నారు.
అతని కిచెన్లో బయటపడ్డ పాము
ప్రపంచంలోనే రెండో అత్యంత విషమైన
"ఈస్టర్న్ బ్రౌన్ పాము". అది కానీ కాటు
వేసిందంటే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఆస్ట్రేలియాలో
ప్రతి యేటా ఈ పాము
కాటు వల్ల ఎంతో మంది
ప్రాణాలు విడుస్తున్నారు.
Tags
Viral News & Videos