Corona Vaccine Ready 6 Crs Doses Production by this Year End(కరోనా కి వ్యాక్సిన్ సిద్ధం చేసినా ఇండియా ఈ ఏడాదిలో 6 కోట్ల డోసుల ఉత్పత్తి)



కరోనా వైరస్ను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం వ్యాక్సిన్తో మాత్రమే సాధ్యం అవుతుందనే సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచంలోని అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేపడుతున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాలు ఆశాజనకంగా ఉన్నాయి. కోతులపై చేపట్టిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇచ్చాయి. రాకీ మౌంటెన్ ల్యాబొరేటరీలో ఆరు కోతులపై గత నెలరోజులుగా పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ అందించిన తర్వాత కోతులకు అధిక వైరస్ప్రభావానికి గురయ్యేలా చూశారు. 28 రోజుల తర్వాత అన్ని కోతులూ ఆరోగ్యంగా ఉన్నాయని గుర్తించారు.

కోతులపై వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేయడంతో మనుషులపై ప్రయోగాత్మకంగా పరీక్షలు మొదలుపెట్టారు. 550 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. మే నెలాఖరులోపు 6 వేల మందిపై ప్రయోగం పూర్తి కానుంది.

ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తోన్న వ్యాక్సిన్ను భారత్లో ఉత్పత్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏడాది 60 మిలియన్ల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రపంచంలోనే భారీ మొత్తంలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సంస్థగా దీనికి పేరుంది. “ChAdOx1 nCoV-19”గా పిలుస్తోన్న వ్యాక్సిన్ కోవిడ్-19పై ప్రభావం చూపుతుందని ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ జంతువులపై చేపట్టిన ప్రయోగాలు విజయవంతం కావడం.. మనుషులపై ప్రయోగాలు చేస్తుండటంతో వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకోవాలని సీరమ్ నిర్ణయించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال