Corona Lockdown Time This Snacks will Beneficial for Weight Loss(కరోనా లొక్డౌన్ టైం లో ఈ స్నాక్స్ తింటే బరువు తగ్గడం పక్కా)


రోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ వల్ల ఇంట్లోనే కుర్చొని బరువు పెరుగుతున్నామని వర్రీ అవుతున్నారా? చిరుతిండ్లతో నోటిని లపలపలాడించకుండా.. ఎంత అదుపులోకి ఉంచుకుందామన్నా కుదరడం లేదా? ఇందుకు మీరు అస్సలు చింతించక్కర్లేదు. ఎందుకంటే.. తినగలిగే ఆహారంతోనే సులభంగా మీరు రుచులను ఆస్వాదించవచ్చు. మరోవైపు బరువు పెరగకుండా జాగ్రత్తపడవచ్చు. అదెలా అనుకుంటున్నారా? అయితే, కింది పేర్కొన్న ఐదు రకాల ఆహారాల గురించి తెలుసుకోండి.

పచ్చి మామిడి: వేసవిలో ఎక్కువగా అందుబాటులో ఉండేది మామిడి కాయలే. మరి సీజన్లో మామిడి పండు తినకుండా ఉండటం మహాపాపం. అలాగే, పచ్చి మామిడి పండ్లను కూడా తనివితీరా ఆస్వాదించాలి. ఎందుకంటే.. పచ్చి మామిడి బరువును తగ్గించే ఔషదం. మాంచి పచ్చి మామిడి కాయను తీసుకుని ముక్కలు చేసుకుని.. దానికి ఉప్పూ కారం అద్దుకుని.. వీలైతే కాస్త మసాల తగిలించి తిని చూడండి. రుచికి రుచికి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

పెరుగు.. చియా, అవిసె, గుమ్మడి గింజలు: గడ్డ పెరుగులో ఏం వేసుకుని తిన్నా భలే రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో దానిమ్మ కాయ ఉన్నట్లయితే.. దాని గింజలు వేసుకుని తిని చూడండి. రుచి భలే ఉంటుంది. అలాగే, చియా, అవిసె, గుమ్మిడి గింజలతో కూడా పెరుగును తినవచ్చు. ఇది మీ కడుపు నింపడమే కాకుండా, కెలోరీల భారం లేకుండా చూస్తాయి.

క్యారెట్లు: క్యారెట్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగు పరిచేందుకు, బరువును తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి.. మీ ఇంట్లో క్యారెట్లు ఉన్నట్లయితే.. సాయంత్రం వేళ సన్నగా తరిగి.. కొద్దిగా నిమ్మకాయ పిండుకుని తింటే భలే టేస్టీగా ఉంటాయి.

స్ట్రాబెర్రీలు: మీకు స్ట్రాబెర్రీలు అందుబాటులో ఉన్నట్లయితే.. తప్పకుండా తినండి. 100 గ్రాముల స్ట్రాబెర్రీల్లో కేవలం 32 కెలోరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి.. వీటిని తిన్నంత సేపు బరువు పెరుగుతున్నామనే బెంగే ఉండదు.

ఉడికించిన కోడి గుడ్డు: గుడ్డు వల్ల బరువు పెరుగుతామని చాలా మంది భావిస్తారు. వాస్తవానికి గుడ్డులో పచ్చ సెనతో కలిసి కనీసం 100 కెలోరీలు కూడా ఉండవు. కాబట్టి పచ్చ సొనను పక్కన పెట్టాల్సిన అవసరమే లేదు. గుడ్డును బాగా ఉడికించి.. ముక్కలుగా చేసుకుని దానిపై పెప్పర్ లేదా ఉప్పు, కారాన్ని చల్లుకుని తింటే భలే టెస్టీగా ఉంటుంది. కడుపు కూడా నిండుతుంది. చూశారుగా.. ఫుడ్ను రోజు నుంచే ఆరగించండి మరి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال