వేంకటేశ్వరస్వామిని కొలిచే భక్తులు ఎక్కువ ఉంటారు. ఇటీవలె గుంటూరు సమీపంలో ఉన్న లింగమనేని టౌన్షిప్లో శుక్రవారం ఏకశిలతో శ్రీమహావిష్ణువు ఏకాదశ రూపాలు అయిన 11 అడుగుల ఎత్తున్న దశావతారమున్న వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహ ప్రతిష్ట దత్త పీఠాధిపతి అయిన గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా జరిగింది. ఈ దశావతార విగ్రహం భక్తులను ఎంతో విశేషంగా ఆకట్టుకుంది. అవతారమంటే ఇదేనా అన్నట్టు ఉంది ఆ విగ్రహం. ఆయన 21 అవతారాలలో అతి ముఖ్యమైన దశావతారాలు. శ్రీహరి దశావతారాలకు వేర్వేరుగా ఆలయాలు ఉన్నప్పటికీ అత్యధికంగా నారసింహా, శ్రీకృష్ణ, శ్రీరాముడు, వెంకటేశ్వర క్షేత్రాలే అత్యధికంగా దర్శనమిస్తాయి. ఇక కూర్మావతారానికి సంబంధించి ప్రపంచంలో కూర్మనాథ ఆలయం ఒక్కటే ఉంది.
ఇక మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, వేంకటేశ్వరవతారం, కల్కి అవతారాలు.. ఈ దశావతారాలను ఒకే విగ్రహంలో ఉండేలా చూడటం అనేది ఎంతో చూడ ముచ్చటగా ఉంది ఈ విగ్రహం. ఈ అవతారాలన్నీ శ్రీవెంకటేశ్వరుని రూపంలో భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రపంచంలో మరెక్కడా కూడా ఈ దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయం కనిపించదు అందుకే ఇది ఇంతటి విశిష్టతను సంతరించుకుంది.
శ్రీవారి పాదాలతోనూ అలాగే మోకాళ్ల వరకూ మత్స్యావతారంలో, నడుము వరకూ కూర్మావతారంలోనూ దర్శనమిస్తుంది. శ్రీనివాసుడు, నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖంగా ఉండగా ఈ విగ్రహం ఎనిమిది చేతులతో చేశారు. వామనావతారానికి సూచికగా ఒక చేత్తో గొడుగు, రామావతారానికి సూచికగా బాణం, విల్లుమ్ములు, పరశురామావతారానికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణావతారానికి సూచికగా నెమలి పింఛం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం.. విష్ణుమూర్తి చేతిలో ఉండే శంఖు, చక్రాలు మరో రెండు చేతులకు అలంకరించారు. ఇలా ఎంతో రక రకాల అవతారలతో బాగా చేశారు. ఇక ఈ శిల్పం కర్నూలుజిల్లా ఆళ్లగడ్డకు చెందిన శిల్పి వి సుబ్రమణ్య ఆచార్యులు రాతితోనే దీన్ని నిర్మించారు.
Tags
Devotional