Lord Shiva`s this Mantra can heal Corona Virus(పరమ శివుణ్ణి ఈ మంత్రంతో పూజిస్తే...కరోనా కాదు గాధ ఏ విష గాలి సోకదు)


సృష్టి లయకారకుడు పరమేశ్వరుడు. అందుకే శివుడాగ్న లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు. సృష్టిలో ప్రతి జీవికి జరిగే పరిమాణాలన్నీ పరమేశ్వరుడి చేతనే లయం చేయబడుతుంటాయి. అందుకే అవన్నీ శివుడి నుంచే వచ్చి, తిరిగి శివుడిలోనే ఐక్యమవుతాయి. అందుకే లయకారకుడయిన శివుని మృత్యుంజయ మంత్రంతో జపిస్తే ఎలాంటి భయాలు దరిచేరవు. అంతేకాదు... మరణ భయం కూడా తొలగుతుంది.
"ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్‌"

భావం: 'అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాం. తొడిమ నుంచి పండు వేరు పడే విధంగా, మేము కూడా మరణం నుంచి, మర్త్యత్వం నుంచి విడుదల పొందాలి'.
మహా మృత్యుంజయ మంత్రం పరమ మహిమాన్వితమైనదనీ, దీని పఠనం దీర్ఘ అనారోగ్యాలనూ, అపమృత్యు భయాన్నీ దూరం చేస్తుందనీ పెద్దల మాట.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال