Hot Anchor cum Model Who is She (హాట్ యాంకర్, యాక్ట్రస్, మోడల్.. ఎవరు అని అనుకొంటున్నారు )


మహిళ టీవీ సీరియల్ నటిగా తరువాత వ్యాఖ్యతగా తరువాత క్రికెట్కామెంటేటర్గా, తరువాత బాలీవుడ్నటిగా ఎదిగటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన అందాల భామ మందిరా బేడి. 1994లో దూరదర్శన్లో ప్రసారమైన శాంతి అనే టీవీ సీరియల్లో నటించిన మందిరా టైటిల్రోల్లో ఆకట్టుకుంది. తరువాత ఔరత్‌, దుశ్మన్‌, క్యోంకి సాస్బి కబి బాహు తీ లాంటి సీరియల్స్లో బుల్లితెర మీద స్టార్ ఇమేజ్అందుకుంది. 2003, 2007 సంవత్సరాల్లో క్రికెట్ వరల్డ్కప్కామెంటేటర్గా, 2004,2006 చాంపియన్స్ట్రోఫీలకు వ్యాఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంది మందిర.

కేవలం సీరియల్ నటిగా, క్రికెట్ వ్యాఖ్యతగా మాత్రమే కాదు ఫ్యాషన్డిజైనర్గా కూడా తనదైన ముద్ర వేసింది మందిరా బేడీ. 2014లో లాక్మీ ఫ్యాషన్వీక్లో తాను డిజైన్చేసిన చీరలను ప్రదర్శించి ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో డిజైనర్గా పేరు తెచ్చుకుంది. తరువాత తాను డిజైన్చేసిన శారీస్ను అమ్మేందుకు స్టోర్ను కూడా ప్రారంభించింది.

ఫిలిం కెరీర్విషయానికి వస్తే బాలీవుడ్ఎవర్గ్రీన్క్లాసిక్దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాతో సిల్వర్ స్క్రీన్ఎంట్రీ ఇచ్చింది మందిరా బేడీ, టీవీ వ్యాఖ్యతగా కొనసాగుతూనే సినిమాల్లోనూ నటించింది. అయితే సినిమాల ఎంపికలో మాత్రం చాలా సెలక్టివ్గా ఉంటుంది బ్యూటీ. తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్కు తగ్గ పాత్రలు మాత్రమే ఎంచుకొని చేస్తోంది. ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమాలోనూ కీలక పాత్రలో నటించింది. తరువాత పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఆయన కొడుకు ఆకాష్హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాలో కీలక పాత్రకు మందిరాను తీసుకున్నారు. కానీ కొంత షూటింగ్ తరువాత ఆమెను తీసేసి స్థానంలో రమ్యకృష్ణను తీసుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال