దాదాపుగా అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థలు కూడా తమ టారిఫ్ ప్లాన్ల ధరలను 2019 చివరి నాటికి పెంచగా, BSNL మాత్రం తన వినియోగదారుల కోసం ఈ పనిని ఇంకా చేయలేదు. అంటే ఇప్పటివరకు బిఎస్ఎన్ఎల్ నుండి దాని టారిఫ్ ప్లాన్ల ధరలలో ఎటువంటి పెరుగుదల లేదు. అయితే, రిలయన్స్ జియో, ఎయిర్టెల్ , వోడాఫోన్-ఐడియా వారి ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచడాన్ని మేము చూశాము. కానీ ఇప్పటివరకు, అదే తక్కువ ధరలలో మునుపటి మాదిరిగానే అదే ధరలకు బిఎస్ఎన్ఎల్ మాత్రమే అందిస్తోంది.
ఏదేమైనా, కంపెనీ
తన టారిఫ్ ప్లాన్ల ధరను ఏ విధంగానూ
పెంచకపోగా, కంపెనీ తన ప్లాన్లల్లో కొన్ని
మార్పులు చేస్తూ, కొత్త ప్లాన్లను ప్రారంభిస్తూనే
ఉంది. అదే దారిలో, సంస్థ
ఇటీవల బిఎస్ఎన్ఎల్ రూ .96, రూ .236 ధరకు రెండు కొత్త
ప్లాన్లను లాంచ్ చేసింది. ఇవి
డేటాని ఎక్కువగా ఆశించేవారికి సరైన వాటిగా ప్రతిరోజూ
10GB డేటాతో ఆఫర్ చేస్తోంది. ఈ
ప్లాన్ల వ్యాలిడిటీలో మార్పు కనిపిస్తుంది. ఇవి వరుసగా 28 మరియు
84 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. ఇప్పుడు ఈ ప్లాన్ల యొక్క
ఇతర వివరాలను పరిశీలిద్దాం ...
రూ .96 ధరలో వచ్చే ప్లాన్
విషయానికి వస్తే, ఈ ప్లాన్ 28 రోజుల
చెల్లుబాటుతో కంపెనీ ప్రారంభించింది. ఈ ప్లాన్ లో
ప్రతిరోజూ 10 GB డేటాను అందిస్తున్నారు. దీనితో, ఈప్లాన్ లో మీరు మొత్తం
280GB డేటాను అందుకుంటారు. అలాగే, ఈ ప్లాన్ లో
మీకు కాలింగ్ వంటి ఇతర ప్రయోజనాలు
లభించవు. అంటే మీకు కాల్
మరియు SMS సౌకర్యం లభించడం లేదు.అయితే, ఇది కాకుండా, మీకు 236 రూపాయల ధరలో వచ్చే ఇతర ప్లాన్ కూడా వుంది. ఇక దీని గురించి మాట్లాడితే, ఈ ప్లాన్ను 84 రోజుల చెల్లుబాటుతో కంపెనీ ప్రారంభించింది మరియు ఈ ప్లాన్ లో మీకు 10GB రోజువారీ డేటా ఇవ్వబడుతోంది. ఈ ప్లాన్ లో కూడా మీరు డేటా ప్రయోజనాలను మాత్రమే పొందుతారు ఈ ప్లాన్ లో మీరు 10Mbps స్పీడ్ అందుకుంటారు, అంటే ఈ ప్లాన్లతో కంపెనీ రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ వంటి వాటిని కూడా వెనక్కు నెట్టేసింది.
ఇటీవల బిఎస్ఎన్ఎల్ తన 4 జి నెట్వర్క్ను పెద్ద ఎత్తున విస్తరించిందని మనకు తెలుసు. అయితే, ఇప్పటివరకు ఈప్లాన్లను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కోల్కతా, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, చెన్నై, తమిళనాడు, మరియు మధ్యప్రదేశ్ సర్కిళ్లలో మాత్రమే అందిస్తున్నారు.