మన హిందూ పురాణాల ప్రకారం
దేవతా మంత్రాలకు అపారమైన శక్తి ఉంది. ఈ
మంత్రాలను జపించడం వల్ల అపరమితమైన
ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. సరైన
పద్ధతిలో వీటిని సరిగ్గా
ఉచ్ఛరిస్తే మనలో దైవత్వ ప్రకంపనలు
సిద్ధిస్తాయి. విశ్వంలోని ఈ ప్రకంపనలు మనకు
మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైంది లక్ష్మీ మంత్రం. దీన్ని సిద్ధి మంత్రం అని కూడా అంటారు.
ఈ మంత్రల్లో ప్రతి అక్షరం అత్యంత
శక్తివంతమైంది. మనస్ఫూర్తిగా ,నిష్టగా వీటిని జపిస్తే అనుకూల ఫలితాలు లభిస్తాయి. జీవితంలో ఎదురయ్యే ఆర్ధిక ఆటంకాలు తొలగిపోయి విజయాలు దరిచేరుతాయి. అయితే దీపావళి రోజున
కొన్ని ప్రత్యేక మంత్రాలను ఉచ్ఛరిస్ మన కోరికలు త్వరగా
నెరవేరుతాయి .
ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ:
మంత్రాన్ని108 సార్లు నిష్ఠగా పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు
కలుగుతాయి.
ఓం
హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే
నమ: మంత్రాన్ని108 సార్లు ఉచ్చరించడం వల్ల అన్ని రంగాల్లోనూ
అభివృద్ధి సాధిస్తారు.
ఓం శ్రీం శ్రీ అయే
నమ: మంత్రాన్ని 108 సార్లు పలకడం వల్ల మానసిక
సంతోషం లభిస్తుంది.
ఓం మహాదేవ్యేచ విద్మహే, విష్ణు పత్నేచ దీమహే... తన్నో లక్ష్మీ ప్రచోదయాత్
అనేది లక్ష్మీ గాయత్రి మంత్రం.ఈ మంత్రం జపించడం
వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు.అలాగే
ఓ శ్రీంగ్ హ్రింగ్ క్లీంగ్ ఐంగ్ సంగ్
ఓ హ్రింగ్ కా ఏ ఈ
లే... హ్రింగ్ హసా కా హ
ల హ్రింగ్ సకల్... హ్రింగ్ సౌంగ్ ఐంగ్, క్లీంగ్
హ్రింగ్ శ్రీంగ్ ఓం అనే మంత్రాన్ని
108 సార్లు జపించడం వల్ల వృత్తి, ఉద్యోగ,
వ్యాపార, ధన వస్తు లాభం,కుటుంబవృద్ధి ,మానసిక, శారీరక అనారోగ్యాలు సమసిపోతాయి. అలాగే వైవాహిక జీవితంలో
ఇబ్బందులు తొలగిపోతాయి.అలాగే ఈ దీపావళి
రోజున శ్రీ మహాలక్ష్మీకి కోటి
కుంకుమార్చన, శ్రీ మహా లక్ష్మీకి
108 కలువ పువ్వులతో పూజలు చేస్తే ఆ
ఇంటి ఇల్లాలికి అఖండ సౌభాగ్యం ,మహా
పుణ్యం చేకురుతాయని వేదాలు గోషిస్తున్నాయి . మన పూజ గదిలో
గానీ, ఆలయంలో గానీ కూర్చుని వీటిని
నిష్ఠగా జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం
లభిస్తుంది.
Tags
Devotional