సీజనల్
ఫ్రూట్స్ గా పరిచయమయ్యే సీతాఫలంను
ఖచ్ఛితంగా తినాలి అంతే కాదండోయ్..ఇందులోఆరోగ్యానికి
సంబంధించి అద్భుతమైన శరీరంలో వ్యర్థంగా ఉండే ఫ్రీరాడికల్స్ ను
నివారించే విటమిన్ సి అనే యాంటీ
ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.
ఇంకా....క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, నియాసిన్ మరియు
పొటాషియంలు కూడా అధికంగా ఉన్నాయి.
ఇవన్నీ శరీరానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతాయి.
ఈ ఫ్రూట్ లో క్యాలరీలు ఎక్కువైనా,
రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా స్మూతీస్, మిల్క్ షేక్స్, డిజర్ట్స్ , ఐస్ క్రీమ్స్ లో
అధికంగా ఉపయోగిస్తుంటారు, ఫ్రెష్ గా ఉన్న ఫ్రూట్
ను నేరుగా తిన్నా భలే మజాగా ఉంటుంది.
ఒక రకంగా చెప్పాలంటే ఇది
డైరీప్రొడక్ట్స్ కు ఆల్టర్నేటివ్ అని
చెప్పవచ్చు. డైరీ డైట్ లో
పాల, పాల ఉత్పత్తులు నచ్చని
వారు, వాటి స్థానంలో సీతాఫంల
చేర్చుకోవచ్చు. దీని వల్ల శరీరానికి
సరైన న్యూట్రీషియన్స్ అందుతుంది. సీతాఫలంను రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా
ఎందుకు చేర్చుకోవాలో తెలుసుకుందాం...
జీర్ణ
శక్తిని పెంచుతుంది:
సీతాఫలంలో
డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది.
ఇది జీర్ణ శక్తిని పెంచడంలో
గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే
కాదు కాపర్ వంటి మినిరల్
డైజెస్టివ్ ట్రాక్ ను హెల్తీగా మరియు
స్ట్రాంగ్ గా మార్చుతుంది. స్టూల్
ను సాప్ట్ గా మార్చి, బౌల్
మూమెంట్ స్మూత్ చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, జీర్ణ
సమస్యలు, మలబద్దక సమస్యలను నివారిస్తుంది.
వ్యాధినిరోధకతను
పెంచుతుంది:
ఎవరికైతే
వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.
వారిలో ఇమ్యూనిటి పెంచడంలో ఈ సీజనల్ ఫ్రూట్
గ్రేట్ గా సహాయపడుతుంది. సీతాఫలంలో
విటమిన్ సి అధికంగా ఉండటం
వల్ల ఇమ్యూన్ సిస్టమ్ హెల్తీగా ఉంచుతుంది. ఒకటి లేదా రెండు
స్పూన్ల క్రీమ్ జ్యూస్ ఇన్ఫెక్షన్స్, అలర్జీలకు వ్యతిరేఖంగా పోరాడుతుంది. శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. దాంతో
వ్యాధులను నివారించుకోవచ్చు.
బ్రెయిన్
హెల్త్ ను మెరుగుపరుస్తుంది:
సీతాఫలం
బి కాంప్లెక్స్ విటమిన్స్ కు మూలం. ఇవి
బ్రెయిన్ లో జిఎబిఎ అనే
న్యూరో కెమికల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
పరిశోధనల ప్రకారం ఈ కెమికల్స్ ను
సీతాఫలంలో కనుగొనపబడినది. ఇవి స్ట్రెస్, డిప్రెషన్,
టెన్షన్, మరియు చీకాకును నివారిస్తుంది.
సీతాఫలంను రెగ్యులర్ గా రోజూ తినడం
వల్ల మతిమరుపు , బ్రెయిన్ డిసీజెస్ ను నివారిస్తుంది.
హెల్తీ
స్కిన్ అండ్ హెయిర్ :
సీతాఫలంలో
ఉండే విటమిన్ ఎ స్కిన్ మరియు
హెయిర్ కు గ్రేట్ గా
సమాయపడుతుంది. సీతాఫలం తినడం వల్ల చర్మాన్ని
తేమగా ఉంచుతుంది. యాంటీ ఏజింగ్ గా
పనిచేస్తుంది. విటమిన్ సి, ఎ, బి
మరియు యాంటీఆక్సిడెంట్స్ కారణంగా చర్మం కాంతివంతంగా మారుతుంది.
స్కిన్
ఇన్ఫెక్షన్స్ ను నయం చేస్తుంది:
సీతాఫలంను
రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం
వల్ల చర్మంలో కొత్త కణాల లేయర్స్
ఏర్పడుతాయి. అంతే కాదు ఇది
పొట్ట సమస్యలను, గాయాలను మాన్పుతుంది. గాయాలు త్వరగా మానడానికి కార్టిజోల్ , టెడంన్స్, లిగమెంట్స్ ను ఫార్మేట్ చేస్తుంది.
గర్భిణీలకు:
గర్భిణీలు
సీతాఫలం తినడం వల్ల పుట్టబోయే
బిడ్డలో నర్వెస్ సిస్టమ్, బ్రెయిన్ , ఇమ్యూనిటి సిస్టమ్ హెల్తీగా , ఎఫెక్టివ్ గా ఉంటుంది. గర్భస్రావం
జరగకుండా నివారిస్తుంది. సీతాఫలంలో ఉండే సవ్ీట్ టేస్ట్
ప్రసవ సమయంలో నొప్పులను తగ్గిసుతుంది. ఎందుకంటే సీతాఫలంలో ఐరన్ అధికంగా ఉండటం
వల్ల ప్రీమెచ్యుర్ బర్త్ డిఫెక్ట్స్ ను
నివారిస్తుంది. తల్లిలో పాల ఉత్పత్తిని పెంచుతుంది.
కళ్ళ
ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
సీతా
ఫలంలో ఉండే వివిధ రకాల
విటిమిన్స్ కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ముఖ్యంగా విటమిన్ ఎ, సిలు కంటి
చూపును మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే
రిబోఫ్లెవిన్, విటమిన్ బి 2 ఫ్రీరాడికల్స్ కల్స్
ను తొలగించి, కళ్ళ సమస్యలను, అలర్జీలను
దూరం చేస్తుంది.
హార్ట్
హెల్త్ :
సీతాఫలంలో
ఉండే సోడియంమరియు పొటాసియంలు బ్లడ్ ప్రెజర్ ను
కంట్రోల్ చేయడానికి గొప్పగా సహాయపడుతాయి. శరీరంలో ఉండే హై లెవల్
మెగ్నీషియం మజిల్స్ స్మూత్ గా మార్చుతాయి. కండరాల
నొప్పులను నివారిస్తాయి. హార్ట్, స్ట్రోక్ నుండి రక్షణ కల్పిస్తుంది.
క్యాన్సర్
నివారిణి:
సీతాఫలంను
వివిధ రకాల హెర్బల్ సప్లిమెంట్స్
లో ఉపయోగిస్తుంటారు. ఈ హెర్బల్ సప్లిమెంట్స్
వివిధ రకాల ట్యూమర్స్ ను
నిరిస్తుంది. క్యాన్సర్ బారీ నుండి రక్షణ
కల్పిస్తుంది. సీతాఫలంలో ఉండే ఎసిటోజెనిన్ మరియు
ఆల్కలాయిడ్స్ క్యాన్సర్ మరియు రీనల్ ఫెయిల్యూర్
ను నివారిస్తుంది.
Tags
Health & Fitness