డైయాబెటిస్ అంటే ఏమిటి,ఎవరికి వస్తుంది ?ఎందుకు వస్తుంది ?

షుగర్  డైయాబెటిస్ అనే పదాలు ప్రతి ఇంటిలో ఎప్పుడు కామన్ అయిపోయింది .ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఇంటికి ఒకరికైనా ఉంటుంది. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది ? ఎవరికి వస్తుంది అనేది ఇప్పటి వరుకు ఎవరికి అంతుపట్టడం లేదు . అయితే ఈ దియాబెటిక్ సమస్య ఎందుకు వస్తుంది ? ఎవరికి వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం . డైయాబెటిస్ పుట్టిన పాప నుండి వయో వృద్ధుడి వరుకు ఐ వయస్సు వారికైనా  అయినా రావచ్చు.
సాధారణంగా అధిక బరువు, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవటం, మానసిక ఒత్తిడి, అధిక కొలెస్ట్రాల్ అనారోగ్యకరమైన జీవనశైలి,మరియు ఇతర వంశపారంపర్య కారణాల వల్ల డైయాబెటిస్ వస్తుంది. డైయాబెటిస్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే డైయాబెటిస్ గురించి ప్రజల్లో ఇప్పుడు అవగాహనా వచ్చింది.  
అయితే డైయాబెటిస్ ఉండే ఇళ్లల్లో ... మన తర్వాత వంశానికి రాకూడదు అంటే ముందు నుంచే క్రమం తప్పకుండ ప్రతి రోజు వ్యాయామం, బయట ఆహారానికి, దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా జీవితాంతం ఆరోగ్యంగా గడపొచ్చు. అయితే డైయాబెటిస్ వచ్చిందా లేదా అని సందేహం ఉంటె.. ఈ లక్షణాలను గమించి మీకు ఉందొ లేదో తెలుసుకోండి.

డైయాబెటిస్ లక్షణాలు..
విపరీతంగా దాహం వేయడం,అతి ఆకలి, రాత్రి 3-4 సార్లు మూత్రానికి వెళ్లాల్సిరావటం
రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ 250 కి మించి ఉండటం
మెదడు ,నరాల సంబంధిత సమస్యలు
కండరాల క్షీణత, అతిగా బరువు తగ్గటం

డైయాబెటిస్ రాకుండా ఉండటానికి పాటించాల్సిన  నియమాలు..
తగినంత మంచి పౌష్ఠిక ఆహారం తీసుకోవటం
రోజూ కనీసం అరగంటపాటైనా యోగ ,వ్యాయామం చేయటం
యోగా, ధ్యానం చేయటం ద్వారా ఒత్తిడిని దూరంగా వుంచడం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال