ఉసిరి కాయంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఉసిరి కాయలతో రకరకాల వంటలు చేస్తుంటారు. అలాగే ఉసిరికాయలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వైద్య పరంగా ఉసిరిక ఎన్నో ఔషధగుణాలున్న వృక్షం. ఆయుర్వేదంలోను, యునానీ ఔషధాల్లో వీటిని విరివిగా వాడతారు. అలాగే ఈ చెట్టు కాయలు, పువ్వులు, బెరడు, వేరు అన్నీ సంపూర్ణ ఔషధగుణాలు కల భాగాలే. ఉసిరి తీనటం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు.
అలాగే నిధానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు. ఉసిరికాయ తినడం వల్ల జుట్టురాలడం తగ్గుట, అజీర్తి సమస్యలు, శరీరంలోని మలినాలు తొలగుతాయి.సంతాన సమస్యలు తొలగుతాయి. అంతేకాక శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఇలాంటి గొప్ప సుగుణాలు ఉన్న ఉసిరికాయను ఆదివారం నాడు, రాత్రి పూట తినకూడదు అని ఎందుకు అంటారో తెలుసా..? ఎందుకంటే, ఉసిరి కాయలో సూర్య శక్తి దాగి ఉంటుందట. మరి సూర్యునికి ప్రధానమైన ఆదివారం నాడు ఉసిరికాయకు మరింత బలం చేకూరుతుంది.
అటువంటి ఉసిరికాయని ఆ రోజంతా కదిలించకుండా ఆ తరువాతి రోజు తినడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. అదే విధంగా
ఉసిరికాయ లో ఉండే విటమిన్ సి పేగులలో ఆమ్లాన్ని పెంచుతుంది. రాత్రి సమయంలో ఆమ్లాలు తినడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు.అజీర్తి కారణంగా గుండె మంట వంటివి కలుగవచ్చు. అంతేకాక ఉసిరికాయ శక్తిని ప్రేరేపిస్తుంది. రాత్రిపూట ఉసిరికాయ తినడం వల్ల అందులోని శక్తి ప్రేరేపకం మనల్ని మంచి నిద్రకు దూరం చేస్తుంది. అందుకని రాత్రి సమయంలో ఉసిరికాయ తినకూడదు అని అంటారు. అయితే మిగిలిన రోజుల్లో ఉసిరి ఎప్పుడు తిన్నా మనకు ఆరోగ్యకరమే.

Tags
Devotional