మొబైల్
సినిమా థియేటర్
రెడీ.. ఆడియెన్స్
కు ఫుల్
కిక్కు
తాజా సమాచారం మేరకు... గోదారి జిల్లా రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో తొలి మొబైల్ థియేటర్ ఏర్పాటవుతోంది. వెదర్ ప్రూఫ్- ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్ లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసి ధియేటర్ ను రూపొందిస్తున్నారని తెలిసింది.
పిక్చర్ డిజిటల్స్ సంస్ధ ఆంధ్రప్రదేశ్ లో దీనిని ప్రారంభిస్తోంది. ఆచార్య సినిమాతో థియేటర్ ప్రారంభమవుతోందని సంస్ధ ప్రతినిధి తెలిపారు. ఇది ఒకప్పటి టూరింగ్ టాకీసులకు ఆధునికమైన సౌకర్యవంతమైన రూపం అని వెల్లడించారు. చూస్తుంటే ఈ థియేటర్ ని మడత పెట్టుకుని ఎక్కడికైనా ట్రక్ లో తీసుకుని వెళ్లిపోవచ్చని అర్థమవుతోంది. బహుశా ఈ ప్రయోగం సక్సెసైతే ఏపీలో మరిన్ని మొబైల్ థియేటర్లను ప్రారంభించేందుకు ఆస్కారం ఉంటుంది. ఇది సరికొత్త ట్రెండ్ గా మారుతుంది.
అయితే సాధారణ థియేటర్ల తరహాలోనే డాల్బీ అట్మాస్ తో ఇది ఉంటుందా? సౌండింగ్ విధానం ఎలా ఉంటుంది? లేక ఇందులో లోటుపాట్లు ఏమిటీ.. బెనిఫిట్స్ ఏమిటీ.. ! అన్నది కూడా ఆడియెన్ పరిశీలిస్తారు.సక్సెసైతే గనుక మరింతగా ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది. ముఖ్యంగా రూరల్ ఏరియా నుంచి బయటి థియేటర్లకు ప్రయాణించలేని వారికి ఇలాంటి మోడ్రన్ టూరింగ్ థియేటర్ల అవసరం ఎంతైనా ఉపయుక్తం అని చెప్పాలి. ముఖ్యంగా ఈ తరహా థియేటర్లకు సేఫ్టీ నార్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది గమనించాలి.