What are Benefits Eating Butter Sticky Rice with Mangos(మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు )


వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. వేసవిలో ఆయిల్ ఫుడ్స్కి దూరంగా వుండాలి. ఉదయం పుట అల్పాహారంగా నూనెతో చేసిన వంటలు కాకుండా ఆవిరి పెట్టిన కుడుములు, ఇడ్లీ వంటి వాటిని తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి

మసాలా కూరలు తగ్గించాలి. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్ , డి శరీరానికి అధిక మోతాదులో అందుతాయి. కాఫీ, టీ లకు దూరంగా ఉండాలి. వాటి స్థానంలో రాగి జావ తాగాలి. దీని వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కూల్ డ్రింకులు బదులుగా కొబ్బరి నీరు తాగాలి

కర్భుజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజులు వంటి సీజనల్ పండ్లను తీసుకోవాలి. పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది

సాధారణంగా వేసవి సెలవులు కావటంతో పిల్లలు బయటికి వెళ్లి ఆడుకుంటారు. అలా కాకుండా ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడించాలి. కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేర్ల తెరలను తడిపి కట్టుకుంటే వేడిని ఇంట్లోకి రానీయకుండా చల్లగా ఉంచుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال