That Hot Scene Unforgotable in my Life (ఆ ఒక్క సీన్ నన్ను ఇప్పటికీ బాధిస్తోంది)


నేను గ్లామర్ పాత్రను చేస్తాను.. అలాగని ఎక్కువ గ్లామర్గా కనిపించను. అందాలు చూపించడం అవసరమే కానీ అందాలను ఆరబోయడం ఇష్టం లేదు. ఇదంతా చెపుతుందు ఎవరో కాదు, హీరోయిన్ రాశీ ఖన్నా. ప్రతిరోజు పండుగే సినిమా రాశీ ఖన్నాకు మంచి హిట్టే ఇచ్చింది. అయితే తనకు చేదు అనుభవం.. మర్చిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది వరల్డ్ ఫేమస్ లవర్ అంటోంది రాశీ.

సినిమా పేరు వింటేనే తనకు ఎక్కడా లేని కోపం వస్తోందని చెప్పుకొస్తోంది. ఒక మంచి కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాకు మొదటి అవకాశం. హీరోయిన్లలో మొదటి సీన్ నాదే. అది కూడా బెడ్ మీద ఉన్న సీన్. అందులో నేను విజయ్ దేవరకొండకు ముద్దులు పెట్టాలి. సీన్ దర్సకుడు చెప్పిందే ఆలోచనలో పడ్డా.

ఆరోజు రాత్రి మా తల్లిదండ్రులకు చెప్పా. మా అమ్మ అయితే నీకు సినిమా అవసరమా అంది. నాకు నిద్రపట్టలేదు. అసలు సీన్లలో నటించడమంటే నాకు అస్సలు ఇష్టముండదు. అలా నటించనని నేను ఎంతోమంది డైరెక్టర్లకు చెప్పా. కానీ విజయ్ దేవరకొండ సినిమాలో మాత్రం ఇలాంటివి ఉంటాయని నేను మొదట్లో ఊహించాను.

కానీ దర్సకుడు మాత్రం మొదట్లో అలాంటి సీన్లపై ఎక్కువ ఆలోచించవద్దని చెప్పి షూటింగ్ ప్రారంభంలోనే నాకు సినిమాలో అలాంటి సీన్ ఇచ్చాడు. ఎలాగోలా సీన్లో నటించా. సినిమా విడుదలైంది. సినిమాలో నా పాత్ర చూసిన నా అభిమానులు రాశీ ఖన్నా తెగించిందని సందేశాలు పంపారు. అది నన్ను చాలా బాధించింది. సినిమా కూడా ఫెయిలయ్యింది. ఇప్పటికీ నేను సినిమా గురించి వింటే బాధపడుతుంటానని చెబుతోంది రాశీ ఖన్నా.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال