ఏ దేవాలయంలో గంట అయినా ఒకసారి మోగిస్తే రెండు లేదా మూడు పర్యాయాలు ప్రతి ధ్వనిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం మరొకటి ఉంది. గంటను ఒక్క పర్యాయం మోగిస్తే 108 సార్లు ప్రతి ధ్వనించడం. ఆంధ్ర ప్రదేశ్,ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సంతరావూరు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామిఓ ఆలయం గుర్భగుడిలోని గంటను ఒకసారి మోగిస్తే ఏకంగా 108 పర్యాయాలు ప్రతిధ్వనిస్తుంది. ఆ ప్రతి ధ్వనిలో ఓంకారం స్పష్టంగా వినిపిస్తుంది. కాశీలోని విశ్వనాథునిఆలయం,
సంతరావూరులోని శివా లయంలో ఉన్న గంటలు మాత్రమే ఈ విధంగా ఓంకారాన్ని పలుకుతాయి. ఈ రెండు ఆలయాల్లోని గంటలను తయారు చేసిన వ్యక్తి ఒకరే. 12వ శతాబ్దంలో గుంటూరు జిల్లా అమరావతి మొదలు తిరుపతి పట్టణం దాకా చోళరాజు ఆధీనంలో పరిపాలన సాగేది. చోళరాజు తన హయాం లో ఎన్నో ఆలయాలను నిర్మిం చాడు. సంతరావూరు శివారులోని శ్రీ పార్వతీ సమేత రామలింగే శ్వరస్వామి ఆలయాన్ని నిర్మిం చాడు. ఇక్కడి శివలింగం స్వయంభువ్ఞ. ఈ ఆలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నవి. రెండు నందులు ఉండటం ఒకటయితే, బయటి నుంచి కూడా గర్భ గుడిలో దేవుడి కోసం వెలిగించిన దీపాన్ని చూడగలం.
Tags
Devotional