బంగారపు
/ వెండి లక్ష్మీదేవి ఉంగరాన్ని కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించాలి.
లక్ష్మీదేవి ఏదేని విగ్రహాన్ని ఆవునేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్యప్రాప్తి.
ఆఫీసులో/
వ్యాపారసంస్థలో తూర్పుముఖంగ కూర్చుంటే ధనప్రాప్తి.
పన్నీరుతో కొత్త తెల్లనివస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆవస్త్రంతో వత్తులుచేసి శుక్రవారం ఆవునేతితో ఆ మూడువత్తులతో దీపారాధన చేస్తే సకలసంపదలు కలుగుతాయి
గురువారం ఐదు పత్తివత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండఐశ్వర్యం లభిస్తుంది.
శ్రీ మహాలక్ష్మీ స్తవాన్ని త్రిసంధ్యలలో పఠించువారు మహాధనవంతులవుతారు
— శ్రీదేవీభాగవతము
ప్రతిరోజూ సంపుటిత సహిత శ్రీసూక్తం చదివితే అఖండలక్ష్మి కరుణిస్తుంది.
కమలసప్తమీ వ్రతమును చైత్ర,వైశాఖమాసాలలో శుక్లసప్తమి నాడు శ్రీమత్స్యపురాణంలో చెప్పిన ప్రకారం చేయటం వలన మహాసంపదలు కలుగుతాయి.
కనకధారాస్తవము ప్రతిరోజూ త్రిసంధ్యలలోపఠిస్తే అపారసంపద చేకూరుతుంది.
శుక్రవారం లక్ష్మీదేవిని అష్టగంధాలతో(కర్పూరం,కస్తూరి, పుణుగు,జవ్వాది,అగరు,పన్నీరు, అత్తరు,శ్రీగంధం)
పూజిస్తే కీర్తి,అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
కొత్త సంవత్సరంతర్వాత అనగా ఉగాది తరువాత వచ్చే శుక్రవారం ఇష్టమైన దైవానికి అభిషేకం చేయడంద్వారా ఆ సంవత్సరమంతా ధనానికి కొదవ ఉండదు.జాతకరీత్యా ఉన్నదోషాలు తొలగిపోతాయి.
సౌందర్యలహరి లోని 33.వ శ్లోకం ను 45రోజులు రోజుకు 1000మార్లు పఠించాలి .పెసరపప్పుఅన్నం,తేనె ను నైవేద్యంగా సమర్పించిన అధిక ధనలాభము కలుగుతుంది.
Tags
Devotional