Healthy and Germs Free Stomach(కడుపులో క్రిములు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే )


వాయు విడంగాలను వాయులవంగాలు అంటారు. కారం, చేదు రుచులు కలిగిన వేడి చేసే స్వభావం దీనికి ఉంది. త్రిదోషాలను హరించే శక్తి వీటికి ఉంది. ఇది మంచి విరేచనకారి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. దీన్ని వాడటం వల్ల ఉదరంలోని సకల క్రిములు హరించుకుపోతాయట.

కడుపులో క్రిములకు వాయు విడంగాల చూర్ణం మూడు గ్రాములు, ఒక చెంచా తేనె కలిపి రెండు పూటలూ సేవిస్తే సమస్త క్రిములు చనిపోయాతాయట. క్రిమితో కూడిన చర్మ రోగాలకు రోజూ రెండు పూటలా వాయు విడంగ కషాయం అర ఔన్సు మోతాదుగా తాగుతూ వాయువిడంగ గంధాన్ని శరీరానికి లేపనం చేస్తూ వాయు విడంగాలతో కాచిన నీటితో స్నానం చేస్తూ వాయువిడంగాల పొగను ఒంటికి వేస్తూ, వాయువిడంగ చూర్ణం కలిపిన భోజన పదార్థాలను సేవిస్తుంటే క్రిములన్నీ హరించుకుపోతాయట. చర్మరోగాలు కూడా మటుమాయమవుతాయట.
ఇంట్లోని ఎలుకలు చికాకును కలిగిస్తుంటే వాయు విడంగాలు కరక్కాయలు, ఉసిరికాయలు, తాని కాయలు, లక్క జిల్లేడు పాలు పదార్థాలను సమభాగాలుగా కలిపి నూరి నిప్పు మీద వేసి ఇంట్లో పొగబెడితే ఇంట్లోని ఎలుకలు, తేళ్ళు బయటకు వెళ్ళిపోతాయట.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال