For Asthma patients is Coronavirus can be scary(ఆస్తమా ఉంటే కరోనా వైరస్ సోకుతుందా )


ఆస్తమా ఒక శ్వాసకోశ వ్యాధి. దీనివలన కొవిడ్-19 బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా అనేది ఖచ్చితంగా తేలాల్సి ఉంది. ఆస్తమాతో బాధ పడుతున్నవారిని శ్వాసకోశ సమస్యలకి దారితీసే మహమ్మారి మరింత భయానికి గురి చేస్తోంది. దీంతో బాధ పడుతున్న వారు కనుక కరోనా వైరస్ బారిన పడితే వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని పలు ఆరోగ్య సంస్థలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఇన్ హేలర్స్ అందుబాటులో పెట్టుకుంటున్న వారు కొందరైతే, కరోనా వైరస్ తో పోరాడుతున్న నటుడు ఇడ్రిస్ ఎల్బా లాంటి వారు తమ భయాన్ని పంచుకుంటున్నారు.

కానీ, నెల అమెరికాలో వైరస్ కేంద్రంగా ఉన్న న్యూయార్క్ స్టేట్ విడుదల చేసిన వివరాల ప్రకారం కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారిలో ఆస్తమా లేదు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం కరోనా వల్ల మృత్యువాత పడిన వారిలో కేవలం ఐదు శాతం మందికి మాత్రమే వ్యాధి ఉందని తెలుస్తోంది.

పరిశోధనలు ఇంకా ప్రారంభదశలోనే ఉండడం వల్ల ఫలితాలు ఇవే కచ్చితం అని చెప్పలేం. ఒక యూరోపియన్ పరిశోధకుల బృందం లాన్ సెట్ లో ఇటీవల ప్రచురించిన కథనం ప్రకారం కొవిడ్-19 రోగుల్లో ఆస్తమాతో బాధపడుతున్నవారు తక్కువగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. వాషింగ్టన్ స్టేట్ లో కొవిడ్-19 రోగుల్లో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న 24 మందిలో కేవలం ముగ్గురికి మాత్రమే ఆస్తమా ఉందని గుర్తించారు.

కొవిడ్-19 రోగుల్లో ఆస్తమాతో బాధపడుతున్నవారు చాలా తక్కువగా ఉన్నారు" అని న్యూయార్క్ సిటీ లో 800 కొవిడ్-19 రోగులకి చికిత్స చేసిన లెనాక్స్ హిల్ హాస్పిటల్ లో పల్మనరీ ఎండ్ క్రిటికల్ కేర్ వైద్యుడు డాక్టర్ బుష్రా మినా అన్నారు. అనారోగ్యకరమైన ఊబకాయం, మధుమేహం, దీర్ఘకాలికంగా ఉన్న గుండె జబ్బులు ప్రమాదకారకాలని ఆయన అన్నారు.

  న్యూయార్క్ విడుదల చేసిన కొవిడ్-19 ప్రమాదకారకాలలో వరుసగా రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, డెమెన్షియా, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్నాయి. తరవాత క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉంది. మూత్రపిండ వ్యాధులు, కాన్సర్, గుండె ఆగిపోవడంతో జాబితా పూర్తౌతుంది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎండ్ ప్రివెన్షన్ ఇచ్చిన వివరాల ప్రకారం అమెరికాలో 8 శాతం మందికి - అంటే సుమారుగా 25 మిలియన్ల జనాభాకి - ఆస్తమా ఉంది. ఇది ఒక ఊపిరితిత్తుల వ్యాధి. దీనిమూలంగా శ్వాస తీసుకోడం కష్టమై శరీరం ఆక్సిజన్ కోసం పోరాడవలసి వస్తుంది. దీని లక్షణాలలో దగ్గు, సన్నని గురక కూడా ఉంటాయి.

వైద్యులు అందరూ అంగీకరించే విషయం ఏమిటంటే ఆస్త్మా ఉన్నవారు తప్పనిసరిగా దాన్ని అదుపులో ఉంచే స్టెరాయిడ్స్ వంటి మందులు వాడి తీరాలి. ఎందుకంటే ఆస్తమా వైరస్ తో బాధపడడం కంటే దారిని అదుపులో ఉంచుకోవడం మంచిది కదా.

అరోగ్యనిపుణుల ప్రకారం ఆస్తమా వల్ల కొవిడ్-19 బారినపడే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ అలా జరిగితే కొవిడ్-19 ప్రభావం ఆస్తమా రోగుల మీద తీవ్రంగా ఉంటుందా అన్నది ఒక ప్రశ్న.

"వయసు తక్కువగా ఉండి.. కరోనా వైరస్ చాలా తక్కువ స్థాయిలో సోకితే ఆస్త్మాలేనివారికీ, మీకూ పెద్ద తేడా ఉండదు" అని చెబుతున్నారు అమెరికన్ లంగ్ అసోసియేషన్ బోర్డ్ మెంబర్ డాక్టర్ డేవిడ్ హిల్. కానీ, ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం వ్యాధి కూడా తీవ్రంగానే ఉండే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.

కొవిడ్ చికిత్సలో ముందు వరసలో ఉన్న మౌంట్ సినాయ్ హెల్త్ సిస్టం యొక్క పల్మనరీ మెడిసిన్ విభాగంలో స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ లిండా రోజర్స్ అభిప్రాయం ప్రకారం శ్వాసకోస సమస్యలున్నవారికి వ్యాధి సోకితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అనుకోవడం సహజం. కానీ, "చికిత్స పొందేంత అనారోగ్యంతో ఉన్న రోగుల్లో ఆస్తమా చాలా తక్కువగా ఉంది" అని ఆమె అన్నారు.

ఆమె ఎక్కువగా ఆస్తమా తీవ్రంగా ఉన్న రోగుల మీదే దృష్టి పెడతారు. సమయంలో ఆమె తన ఆస్తమా రోగులందరికీ టెలీమెడిసిన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. "కేవలం ఆస్తమా వల్లే స్టెరాయిడ్స్ మీద ఉన్న రోగులు వీళ్ళు. వీళ్ళు ప్రస్తుతం మాత్రం ఆరోగ్యంగా ఉండడం ఆశ్చర్యమే" అని ఆమె అంటారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఆస్తమా యొక్క ప్రభావాన్ని నిర్ధారించలేము. ఆరోగ్యనిపుణులు చెబుతున్న పరిశోధనల ప్రకారం ఫ్లూ, తేలికపాటి కరోనావైరస్ లు ఆస్త్మాను కొవిడ్-19 ఉన్నవారికి ప్రమాదంగా సూచిస్తున్నాయి. ఆస్తమాని ఒక ప్రమాదకరమైన కారణం కాదని చెప్పలేమని డాక్టర్ రోజర్స్ అన్నారు. "ఎందుకంటే మామూలు పరిస్థితులలో చిన్నపిల్లల్లోనూ, పెద్దవాళ్ళలోనూ కూడా వైరల్ ఇన్ ఫెక్షన్ల వలనే ఆస్తమా తీవ్రత పెరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే" అని ఆమె అన్నారు.

అమెరికన్ కాలేజ్ ఆఫ్ అలెర్జీ, ఆస్తమా ఎండ్ ఇమ్యునాలజీ ప్రెసిడెంట్ డాక్టర్ జె అలెన్ మీడోస్ కూడా అదే అంటున్నారు: "అమెరికాలో సాధారణ వైరస్లు, ఫ్లూ వంటివి ఆస్తమా అదుపులో ఉన్న రోగుల్లో కూడా వ్యాధి ఒక్కసారి తీవ్రమవ్వడానికి కారణాలౌతున్నాయి. కొవిడ్-19 కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నాము".

మేయో క్లినిక్లో ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఎండ్ మెడిసిన్ గా పనిచేస్తున్న క్లినికల్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ యంగ్ జె జన్ వైరస్ మీద విస్తృతంగా పరిశోధించారు. ఆయన అంటువ్యాధుల మీద ఆస్తమా యొక్క ప్రభావాన్ని పరీక్షించారు.

  గణాంకాలను మరింత విస్తృతంగా అధ్యయనం చెయ్యాలని డాక్టర్ జన్ అన్నారు. ఆస్తమా వల్ల అంటువ్యాధులు త్వర్గా సోకుతాయని, తరువాత పరిణామాలు ఆశాజనకంగా ఉండవనీ కూడా ఆయన అన్నారు. ఆయన ఉద్దేశ్యం ప్రకారం కొవిడ్ పరీక్షలూ, సంరక్షణా సరిగ్గా అందుబాటులో ఉండని అల్పాదాయవర్గాలవారిని ఆస్తమా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

"ప్రస్తుతం లభిస్తున్న గణాంకాలు ఆస్తమా ఒక ప్రమాదకారకంగా భావిస్తున్న మార్గదర్శకాలకు మద్దతునిస్తున్నాయి", అని ఆయన అన్నారు. "ఇంకా ఖచ్చితమైన గణాంకాల అవసరం ఉంది", అని కూడా ఆయన అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال