పాములు మనుషులను కరవడం కామన్. అయితే మనిషి పామును కరవడం గురించి వింత ఘటన కర్ణాటక కోలారు జిల్లాలో జరిగింది. తాను వెళ్ళే రోడ్డుకి అడ్డు వచ్చిన పామును పట్టుకున్న వ్యక్తి దానిపై కోపంతో ఊగిపోయాడు. మద్యం మత్తులో ఆ సర్పాన్ని పళ్లతో కొరికి చంపి పరమ శివుడిలా మేడలో వేసుకున్నాడు. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ..
కరోనా లాక్ డౌన్ కారణంగా నలభై రోజుల నుంచి పరితపించిన మద్యం దొరికింది. ఆ ఆనందంలో ఏం చేస్తున్నాననే విచక్షణ కూడా మరిచిపోయాడో మందుబాబు. రోడ్డు మీద వెళ్తున్న ఓ పామును.. బైక్ పై వెళ్లే మందుబాబు పట్టుకున్నాడు. నా దారికే అడ్డం వస్తావా? నీకెంత ధైర్యం అంటూ గట్టిగా అరుస్తూ తాగిన మైకంలో ఆ పామును పళ్లతో కొరికి ముక్కలు చేశాడు. దీనితో ఆ పాము అక్కడే ప్రాణాలు విడిచింది. ఆ తరువాత దానిని మెడలో వేసుకుని మద్యం బాటిల్ తాగుతూ ఉండగా కొందరు వీడియోలు తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఈ ఘటన కర్ణాటక కోలార్ లో ప్రాంతంలో మంగళవారం జరిగింది. పామును కొరికి ముక్కలు చేయడం చూసిన స్థానికులంతా నివ్వేరపోయారు. అతడు కుమార్ అనే వ్యక్తిగా గుర్తించారు. పామును ముక్కలు చేస్తున్నంత సేపు గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. ఇకపోతే లాక్ డౌన్ తరువాత మద్యం దుకాణాలు ఓపెన్ చేయడంతో చాలామంది తెల్లవారు జామునుండే మద్యం దుకాణాల వద్ద క్యూ లైన్స్ లో నిలబడ్డారు
Tags
Viral News & Videos