దేశంలో కేసుల సంఖ్య 30 వేలకు చేరువలో ఉన్నాయి.. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర్ల, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసులు 10వేలకు చేరువలో ఉన్నాయి. తీవ్రత అధికంగా ఉన్న మిగిలిన రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఓ వైప్ నెల రోజులకు పైగా లాక్డౌన్ అమల్లో ఉంది. లాక్డౌన్కు ముందు వ్యాధిసోకినవారు, వారి ద్వారా ఇతరులకు సోకినవారి నుంచి లాక్డౌన్ తర్వాత వ్యాధి సోకదని భావించారు. పైగా లాక్డౌన్ కఠినంగా అమల్లో ఉంది. విదేశాల నుంచి రవాణా బంద్ అయింది. అంతరాష్ట్ర సరిహద్దులు మూసేశారు. జిల్లాల మధ్య కూడా రాకపోకలు లేవు. కేవలం అత్యవసర సర్వీసులు, నిత్యావసరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
అయినా కేసుల తీవ్రత ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఉంటోందనేది అంతు చిక్కడం లేదు. అయితే యాంటీ పారసైట్ అంటే పరాన్న జీవులను చంపే మందయిన ఐవర్ మెక్టిన్ రెండు రోజుల్లో వైరస్ ను చంపగలదని నార్త్షోర్ యూనివర్శిటీ హెల్త్ సిస్టమ్ ఆఫ్ అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ నీరవ్ షా ప్రకటించారు. ఆయన చెబుతున్న ప్రకారం ఈ ఔషధం సురక్షితమని ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందని అంటున్నారు. అయితే ఇప్పటికే ఈ కరోనా కోసం చాలా దేశాలు వ్యాక్సీన్ కనిపెట్టే దిశగా ప్రయోగాలు చేస్తున్నాయి.
ఆస్ట్రేలియా మెల్బోర్న్లో మోనాష్ బయోమెడిసిన్ డిస్కవరీ ఇనిస్టిట్యూట్ కు చెందిన డాక్టర్ కైలీ వోగ్స్టాఫ్ కూడా ఒక అధ్యయనంలో ఈ ఔషధంలోని ఒక డోస్ 48 గంటలు లేదా 24 గంటల్లో వైరస్ లోని ఆర్ఎన్ఎను తొలగించగలదని గుర్తించారు. కరోనా సోకినవారికి చికిత్స అందించేందుకు ఇప్పటికే ఈ మందును ఉపయోగిస్తున్నారని ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ హెల్త్ మెడికల్ సెంటర్ డాక్టర్ జాక్వెస్ రెజ్టర్ చెబుతున్నారు. ఇక ఉటా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అమిత్ పటేల్ ఈ పరిశోధనలో… ఐవర్ మెక్టిన్.. వెంటిలేటర్ మీద ఉంచిన రోగులలో మెరుగైన ఫలితాలను చూపించిందని, ఈ వైరస్ సోకగానే చికిత్స కోసం ఎంత త్వరగా వస్తారో అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు. అయితే కరోనా వైరస్ లో ఇన్వర్టమైసిన్ ఎంత ప్రభావవంతంగా ఉంటుందనేది అధ్యయనం తర్వాత మాత్రమే తేలనుంది.
Tags
Health & Fitness