Avaginjalatho Asthama Adhika Baruvuku Dhuram(ఆవగింజలతో ఆస్తమా, అధికబరువుకు దూరం )


బరువు తగ్గడానికి ఆవాలు బాగా తోడ్పడతాయి. ఆవాలలో విటమిన్‌-బి కాంప్లెక్స్ఎక్కువ. దాంతో వ్యాధి నిరోధక శక్తి
పెరుగుతుంది. అంతేకాదు జీవక్రియలు బాగా జరుగుతాయి.
ఆవాలలోని కెరోటిన్స్, జియాగ్జాంథిన్స్, ల్యూటిన్వంటి పోషకాలు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతల్ని తగ్గిస్తాయి. పరిమాణంలో చాలా చిన్నగా కనిపించే ఆవాలు ఆరోగ్యానికి కొండంత అండగా ఉంటాయి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం వల్ల మంట, నొప్పి తగ్గుతాయి. ఆవాలు ఆస్తమాను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఆవాలతో కూడిన ఆహారం తినేవాళ్లలో ఆస్తమా అదుపులో ఉండటంతో పాటు జలుబు, ఛాతి పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలు తగ్గుతాయి.

పంటి నొప్పి కలిగినపుడు గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కొంత సేపు తర్వాత నీటిని పుక్కలేస్తే నొప్పి తగ్గుతుంది. ఆవాలు ముద్దలా నూరుకొని వేడి నీళ్లు ఉన్న బకెట్లో వేసి స్నానం చేస్తే ఒంటి నొప్పులు మాయమవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال