గత ఏడేళ్ల నుంచి ఓ వ్యవహారం నానుతూనే వస్తోంది. బుల్లితెరపై జంటగా కనిపిస్తూ, ఇద్దరి మధ్య ఏదో ఉందన్న అనుమానం కలిగించేలా తమ కెమిస్ట్రీతో అందర్నీ మైమరింపజేశారు. వార సుడిగాలి సుధీర్-రష్మీ. వీరిద్దరి జంట ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంది. ఇక వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతోన్నారని ఎంతో మంది ఎన్నో రకాల వార్తలను పుట్టించారు. వీరికి ఏర్పడ్డ క్రేజ్ను కొన్ని షోలు బాగానే వాడుకున్నాయి కూడా. కేవలం వీరిద్దరి జంటపైనా ఆధారపడి షోలు నడుస్తున్నాయంటే వీరి క్రేజ్ ఎంతటి పీక్స్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
1
బుల్లితెరపై విపరీతమైన క్రేజ్..
బుల్లితెరపై విపరీతమైన క్రేజ్..
జబర్దస్త్ షోతో మొదలైన వీరిద్దరి కెమిస్ట్రీ దాదాపుగా ఏడేళ్ల నుంచి నిర్విరామంగా అందర్నీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. స్కిట్స్లో భాగంగా రష్మీని వాడుకోవడం, ఆమె కూడా పాజిటివ్గానే రెస్పాండ్ కావడంతో వీరి వ్యవహారాం అలా మొదలైంది. స్కిట్స్లో భాగంగా మొదలై.. స్కిట్స్ మొయిన్ లీడ్ కూడా ఆమె చుట్టే తిరిగే స్థాయికి వచ్చాయి. అలా వీరిద్దరి కెమిస్ట్రీపై జనాలు కూడా బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు.
2
ఢీతో మరింత పాపులార్టీ..
ఢీతో మరింత పాపులార్టీ..
ఢీ షోతో వీరిద్దరి జంటకు మరింత పాపులార్టీ వచ్చింది. ఈ షోలో డ్యాన్సుల సంగతేమో గానీ, వీరిద్దరి మధ్య కామెడీ, లవ్ ట్రాకే ఎక్కువగా ఉంటుంది. జనాలు కూడా వాటిని చూడటానికి ఇష్టపడుతున్నారు. మధ్య మధ్యలో వీరిద్దరు చేసే హంగామా, డ్యాన్సులు, స్కిట్స్ బాగానే వైరల్ అవుతుంటాయి.
3
స్పెషల్ ఈవెంట్స్లోనూ వీరే..
స్పెషల్ ఈవెంట్స్లోనూ వీరే..
సంక్రాంతి, దీపావళి అంటూ ప్రత్యేకంగా నిర్వహించే ఈవెంట్లలోనూ వీరిద్దరిదే హవా. ఆ మధ్య వీరిద్దరికి పెళ్లి చేసిన ఈవెంట్.. ఎంతగా సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజంగా పెళ్లి చేసుకుంటే కూడా అంతగా జీవించరేమో అన్నట్టుగా వర్కౌట్ అయింది. ఇలా ఇవన్నీ చూస్తున్న ప్రేక్షకులకు నిజంగానే వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న అనుమానం కలుగుతుంది.
4
మంచి స్నేహితులం కూడా కాదు..
మంచి స్నేహితులం కూడా కాదు..
అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే వీరిద్దరు ఎన్నోసార్లు నోరు విప్పారు. తామిద్దరం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే అలా నటిస్తామని వివరణ ఇచ్చినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా రష్మీ మాట్లాడుతూ.. తామిద్దరం నటీనటులం, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి స్క్రిప్ట్గా అనుగుణంగా నటిస్తుంటామని చెప్పుకొచ్చింది. నిజ జీవితంలో తామిద్దరం కనీసం మంచి స్నేహితులం కూడా కాదని తెలిపింది. కానీ హాయ్ అంటే హాయ్ అనే ఓ డీసెంట్ రిలేషన్ షిప్ అని చెప్పుకొచ్చింది.
Tags
Movie News