New Features in Facebook(ఫేస్ బుక్లో అదిరిపోయే కొత్త ఫీచర్)


కరోనా లాక్ డౌన్ వేళ టెక్నాలజీ పెరిగిపోయింది. అంతా ఇంట్లోనే వుండడంతో డేటా వినియోగం ఎక్కువయింది. సోషల్ మీడియా యాప్స్ కూడా బాగా వాడుతున్నారు. ఫేస్బుక్ తాజాగా భారత్లో మరో కొత్త సర్వీస్ప్రారంభించింది. పిల్లల కోసం ఉద్దేశించిన మెసెంజర్కిడ్స్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం యాపిల్యాప్స్టోర్నుంచి దీన్ని డౌన్లోడ్చేసుకోవచ్చని, వారాంతంలో గూగుల్ప్లే స్టోర్లో కూడా అందుబాటులోకి తెస్తామని ఫేస్బుక్వెల్లడించింది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో మెసెంజర్యాప్ద్వారా పిల్లలు తమ స్నేహితులతో కనెక్ట్కావడానికి ఇది ఉపయోగపడుతుంది. కరోనా వైరస్కట్టడికి లాక్డౌన్కారణంగా స్కూళ్లు, కార్యాలయాలు మూతబడటంతో సమాచార మార్పిడికి డిజిటల్ప్లాట్ఫామ్లపై ఆధారపడటం పెరుగుతోంది. దీంతో పిల్లలు కూడా స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులతో కనెక్ట్అయ్యేందుకు మెసెంజర్కిడ్స్ఉపయోగపడుతుందని వివరించింది. ఫీచర్ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో వివిధ విద్యాసంబంధమయిన సందేహాలు తీర్చుకోవచ్చు. కంబైన్డ్ స్టడీ తరహాలో మెసెంజర్ కిడ్స్ ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ తెలిపింది. ఇప్పటికే ఫేస్ బుక్ జియోతో ఒప్పందం కుదుర్చుకుంది.

భారీగా పెట్టుబడి పెట్టనున్న సంగతి తెలిసిందే. ప్రజలకు మరింత చేరువ కావడానికి జియో మార్ట్ లు రానున్నాయి. జియో ప్లాట్ఫామ్స్, రిలయన్స్రిటైల్, వాట్సాప్కూడా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్తెలిపింది. రిలయన్స్రిటైల్-కామర్స్విభాగం జియోమార్ట్వ్యాపార కార్యకలాపాలను వాట్సాప్ద్వారా మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది.

అటు చిన్న వ్యాపార సంస్థలకు కూడా ఊతమివ్వనుందని ఆర్ఐఎల్వివరించింది. -కామర్స్దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్కు దీటుగా ఎదిగేందుకు ఇది తోడ్పడనుంది. దీనికి నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు త్వరలో రానున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال