ఇటీవలి కాలంలో సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ కావడం చాలా కామన్గా మారింది. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతెల్లా ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఊర్వశీ తన ట్విట్టర్ ద్వారా పేర్కొంది. ఫేస్ బుక్ లో ఏ పోస్ట్కి రియాక్ట్ కావొద్దని నెటిజన్స్కి స్పష్టం చేసింది. ఇప్పటికే తన విజ్ఞప్తిని ముంబై పోలీసులకి తెలియజేయగా, వారు ఈ విషయాన్ని సైబర్ పోలీసుల దృష్టికి తీసుకెళతామన్నారు.
అయితే హ్యాకర్స్ తనని భారీ మొత్తంలో డబ్బు అడుగుతున్నారని ఊర్వశీ ట్వీట్ చేసింది. తెలుగులోను పలు సినిమాలు చేసిన ఊర్వశీ .. సీటీమార్ అనే చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయనుంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటీమార్ చిత్రంలో గోపిచంద్, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.

Tags
Movie News