కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి ఇమ్యూనిటీని పెంచుకోవడం అవసరం. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు తగిన ఆహారం తీసుకోవాలి. రోజూ పసుపు పాలు తాగితే కరోనా రాకుండా నియంత్రించుకోవచ్చు. పసుపులో యాంటీ-ఇన్ఫ్లామేటరీ, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. అసిడిటీని ఇది దూరం చేస్తుంది. ఇంకా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా జలుబు, దగ్గుకు చెక్ పెట్టవచ్చు. పసుపు పాలను రోజూ ఓ గ్లాసుడు తీసుకోవడం ద్వారా కీళ్లనొప్పులు మాయం అవుతాయి.
హృద్రోగాలు,
మధుమేహాన్ని దరిచేరకుండా కాపాడుకోవచ్చు. థైరాయిడ్ ఇబ్బంది వుండదు. అలాగే మిరియాల పొడి
పావు స్పూన్ చేర్చుకుంటే ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. అలాగే
కరోనా నుంచి దూరం కావాలంటే..
రోజంతా వేడి నీళ్లు తాగుతూనే
ఉండాలి. వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని
వ్యర్థాలు, మలినాలు బయటకు వెళ్లిపోతాయి. రోజూ
కనీసం 30 నిమిషాలు యోగాసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ చేయాలి.
వంటలో
పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఉపయోగించాలి. రోజూ ఉదయాన్నే 10 గ్రాముల
చవన్ప్రాష్ తినాలి. డయాబెటిక్స్ ఉన్నవాళ్లు షుగర్ ఫ్రీ చవన్ప్రాష్ తీసుకోవాలి. తులసీ, దాల్చినచెక్క, మిరియాలు, సొంఠి, మునక్కాతో చేసిన హెర్బల్ టీ
లేదా డికాక్షన్ రోజూ రెండుసార్లు తాగాలి.
గొంతు నొప్పిగా ఉన్నా, పొడిబారినా పుదీనా ఆకులు, వాము వాసన చూడాలి.
లవంగాలు పొడిచేసుకొని చక్కెర, తేనెలో కలిపి రోజూ రెండుమూడుసార్లు
తినాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
Tags
Health & Fitness