స్ట్రాబరీ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?


స్ట్రాబరీ రూపంలో భలే అందంగా ఉండే లిచీ పండ్లు తెలిసే ఉంటుంది. ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే లిచి పండ్లు చైనాలో ఎక్కువగా పండిస్తారు. లిచి పండ్లలో ఉండే విటమిన్ సి ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. తెల్ల రక్త కణాల పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో శరీరంలోకి బాక్టీరియాలు, వైరస్లు ప్రవేశించినా వెంటనే నాశనం అవుతాయి. లిచి పండ్లను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

 లిచీ పండ్లలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పాలిపినాల్స్ అధికంగా ఉంటాయి. క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టడంలో పాలిఫినాల్స్ ఉపయోగపడతాయి. బ్రెస్ట్ క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే లిచీ పండ్లు తింటూ ఉండాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. జీర్ణసమస్యలతో సతమతమయ్యే వారు లిచి పండ్లను తమ ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది.

 ఆస్తమా, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు పండు చక్కని ఔషధం. లిచి పండు బరువు తగ్గించడమే కాదు.. ముఖం కాంతివంతంగా తయారుచేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే మాములుగా ఉన్నప్పుడు ఫ్రూట్ తినడం ఆరోగ్యకరమే. కానీ గర్భంతో ఉన్నప్పుడు తినడం వలన మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో చక్కెర శాతం ఎక్కువ కాబట్టి డయాబెటిస్ కు కారణమవుతుందని అంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال